అధికారం ఉంటే ఎంత దౌర్జన్యమైనా చేయోచ్చా: ఎమ్మెల్యే రాపాక అరెస్ట్ పై లోకేష్ ట్వీట్

Published : Aug 13, 2019, 07:06 PM IST
అధికారం ఉంటే ఎంత దౌర్జన్యమైనా చేయోచ్చా: ఎమ్మెల్యే రాపాక అరెస్ట్ పై లోకేష్ ట్వీట్

సారాంశం

ఒక పత్రికా విలేఖరిని చంపుతానన్న ఎమ్మెల్యేని అరెస్టు చేయని ప్రభుత్వం ప్రజల తరపున ప్రశ్నించిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయిస్తోందంటూ విరుచుకుపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం ఘటనలో ప్రజల తరపున ప్రశ్నించినంత మాత్రాన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని అరెస్టు చేసిందని అభిప్రాయపడ్డారు.

అమరావతి: జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ పై టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. రాపాక వరప్రసాద్ అరెస్ట్ అన్యాయమంటూ చెప్పుకొచ్చారు. ఒక పత్రికా విలేఖరిని చంపుతానన్న ఎమ్మెల్యేని అరెస్టు చేయని ప్రభుత్వం ప్రజల తరపున ప్రశ్నించిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయిస్తోందంటూ విరుచుకుపడ్డారు.

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం ఘటనలో ప్రజల తరపున ప్రశ్నించినంత మాత్రాన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని అరెస్టు చేసిందని అభిప్రాయపడ్డారు. అధికారం ఉంటే ఎంత దౌర్జన్యమైనా చేయొచ్చు. ప్రతిపక్షం మాత్రం న్యాయమడిగినా తప్పా? ఏమిటీ నియంతృత్వం? అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 

ఇకపోతే తనపై నమోదైన కేసుల నేపథ్యంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మలికిపురం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. రాపాకను అరెస్ట్ చేసిన పోలీసులు రాజోలు కోర్టులో హాజరుపరిచారు. ఎమ్మెల్యే రాపాక అరెస్ట్ పై కోర్టు పోలీసులకు అక్షింతలు వేసింది. 

ఈ కేసు తమ పరిధిలోకి రాదని కోర్టు స్పష్టంచేసినట్టు సమాచారం. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు వెళ్లాలని పోలీసులకు సూచించింది. అంతేకాకుండా రాపాకకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయాలని ఆదేశించడంతో పోలీసులు ఆయనకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసి విడుదల చేశారు.

 ఈ వార్తలు కూడా చదవండి

ఎమ్మెల్యే రాపాక అరెస్ట్: పోలీసులపై కోర్టు సీరియస్

గోటితో పోయేదానికి.. రాపాక అరెస్టుపై పవన్ కళ్యాణ్

పోలీసులకు లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

ఎమ్మెల్యే రాపాకపై పోలీస్ కేసు... స్పందించిన డీఐజీ

పోలీసులకు లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేనకు షాక్.. ఎమ్మెల్యే రాపాక అరెస్టుకి రంగం సిద్ధం

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?