జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు

పోలవరం ప్రాజెక్టు అథారిటీ మంగళవారం నాడు హైద్రాబాద్ లో జరిగింది. రివర్స్ టెండరింగ్ విధానంపై జగన్ సర్కార్ కు పీపీఏ అథారిటీ సాకిచ్చింది.

Google News Follow Us

హైదరాబాద్: రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ ఆర్‌కే జైన్ అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు సీడబ్యూసీ కార్యాలంయలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం హైద్రాబాద్ లో జరిగింది. రివర్స్ టెండరింగ్ విధానంలో  ఇబ్బందులు కూడ వస్తాయని కూడ తాము ఏపీ ప్రభుత్వానికి సూచించామని సీఈఓ తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజెన్సీల పనితీరు సంతృప్తిగా ఉందని  ఆయన అభిప్రాయపడ్డారు.   రివర్స్ టెండరింగ్ చేపడితే ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడ ఆయన అభిప్రాయపడ్డారు.

పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు సర్కార్ అవకతవకలకు పాల్పడిందని జగన్ సర్కార్ ఆరోపణలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై నిపుణుల  కమిటీని  ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ పోలవరంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణంలో రివర్స్ టెండరింగ్ విధానంపై పీపీఏ సీఈఓ సంచలన కామెంట్స్ చేశారు.