అంతర్జాతీయ నేరస్తుడి మాదిరిగా అరెస్ట్: ఎమ్మెల్సీ బీటెక్ రవి

Published : Jan 03, 2021, 05:35 PM IST
అంతర్జాతీయ నేరస్తుడి మాదిరిగా అరెస్ట్:  ఎమ్మెల్సీ బీటెక్ రవి

సారాంశం

అంతర్జాతీయ నేరస్తుడి స్థాయిలో తనను వెంటపడి పోలీసులు అరెస్ట్ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి  పోలీసుల తీరుపై మండిపడ్డారు.

కడప: అంతర్జాతీయ నేరస్తుడి స్థాయిలో తనను వెంటపడి పోలీసులు అరెస్ట్ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి  పోలీసుల తీరుపై మండిపడ్డారు.

ఆదివారం నాడు చెన్నైలో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడంపై బీటెక్ రవి వీడియో విడుదల చేశారు.

also read:టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్

అరెస్టులు తనకు కొత్తేం కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పై కూడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. బెంగుళూరు నుండి చెన్నైకు వచ్చిన సమయంలో ఎయిర్ పోర్టులో తనను అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు.

వైసీపీ కక్షపూరిత రాజకీయాలకు ఇది నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. చలో పులివెందుల కార్యక్రమం సందర్భంగా బాధిత కుటుంబం నుండి పిర్యాదు మేరకు కేసులునమోదు చేశారని  పోలీసులు చెప్పారన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తమ పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈ బీటెక్ రవి అరెస్ట్ ను బాబు తీవ్రంగా ఖండించారు. 
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu