అశోక్ గజపతిపై వెల్లంపల్లి వ్యాఖ్యలు: కొబ్బరిచిప్పలు, శెనగలతో టీడీపీ నిరసన

Siva Kodati |  
Published : Jan 03, 2021, 05:26 PM IST
అశోక్ గజపతిపై వెల్లంపల్లి వ్యాఖ్యలు: కొబ్బరిచిప్పలు, శెనగలతో టీడీపీ నిరసన

సారాంశం

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వీటిని నిరసిస్తూ విజయనగరంలో వినూత్న నిరసనకు దిగాయి టీడీపీ శ్రేణులు

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వీటిని నిరసిస్తూ విజయనగరంలో వినూత్న నిరసనకు దిగాయి టీడీపీ శ్రేణులు.

అశోశ్ బంగ్లా నుంచి మయూరి జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ కొబ్బరి చిప్పలు, శెనగలు పట్టుకుని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దేవాలయాలకు రక్షణ కల్పించలేని వెల్లంపల్లి.. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మయూరి జంక్షన్‌లో మావన హారంగా ఏర్పడి.. మంత్రి వెల్లంపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

అంతకుముందు ఆదివారం రామతీర్థం అలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఘటనపై అర్చకులు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Also Read:రామతీర్ధం ఘటనలో 12 మంది అరెస్ట్ .. ఎంతటి వారైనా వదలం: ఎస్పీ

దీని వెనుక టీడీపీ నేతల హస్తముందని మంత్రులు ఆరోపించారు. దేవుడితో పెట్టుకున్న చంద్రబాబుకు తగిన శాస్తి జరుగుతుందని బొత్స తీవ్రవ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఎవర్నీ వదిలి పెట్టమని హెచ్చరించారు. చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu