విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో దుండగులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు.
విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో దుండగులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు.
ఇందుకు సంబంధించి ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల్లో 12 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నామన్నారు. వీలైనంత త్వరగా దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకొని శిక్షిస్తామని ఎస్పీ చెప్పారు. దీని వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని ఆమె తెలిపారు.
మరోవైపు కోదండరాముని దేవాలయం వద్ద గత వారం రోజులుగా నిరసన చేస్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. రామతీర్థంలో కోదండరాముని ఆలయ పరిసరాలను ఆయన ఆదివారం పరిశీలించారు.
Also Read:రామతీర్ధం ఘటన.. బాబు, లోకేశ్‌లకు నార్కో టెస్టులు చేయాలి: కొడాలి నాని
ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5న బీజేపీ- జనసేన పార్టీలు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.
ఈ యాత్రలో ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు బిజెపి, జనసేన ముఖ్య నాయకులు పాల్గొంటారని అన్నారు. ఇక మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ రేపు(సోమవారం) రామతీర్థంను సందర్శించనున్నారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత బొత్స, వెల్లంపల్లి ఆలయం వద్దకు చేరుకునున్నారు.