పోతే పోనీ: మల్లికార్జున్ రెడ్డికి చంద్రబాబు చెక్

By Nagaraju TFirst Published Jan 21, 2019, 12:40 PM IST
Highlights

మేడా మల్లికార్జునరెడ్డికి చెక్ పెట్టింది. రెడ్‌ బస్‌ యాప్‌ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజు, అతని కుటుంబసభ్యులను టీడీపీ సీనియర్ నేత ఎంపీ సీఎం రమేష్ తెరపైకి తీసుకువచ్చారు. చరణ్ రాజు మరియు అతని కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేశ్‌ను కలిశారు. 
 

రాజంపేట: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీలో రాజకీయం రంజుగా మారుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ మారతారంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో నిన్నటి వరకు ఉలిక్కిపడ్డ టీడీపీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెరపైకి కొత్త నేతలను తీసుకువచ్చింది. 

మేడా మల్లికార్జునరెడ్డికి చెక్ పెట్టింది. రెడ్‌ బస్‌ యాప్‌ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజు, అతని కుటుంబసభ్యులను టీడీపీ సీనియర్ నేత ఎంపీ సీఎం రమేష్ తెరపైకి తీసుకువచ్చారు. చరణ్ రాజు మరియు అతని కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేశ్‌ను కలిశారు. 

పార్టీలో చేరే అంశంపై చర్చించారు. మంగళవారం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి ఆ తర్వాత పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే కడప జిల్లాకు చెందిన ముఖ్యనేతలు ఆదివారం రాజంపేటలో పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

మంగళవారం అంటే ఈనెల 22న అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసే అంశంపై చర్చించారు. అయితే ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని ఆహ్వానించలేదు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కావాలనే తనకు సమాచారం ఇవ్వకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి మాత్రం సమీక్షపై ఆహ్వానించేందుకు ప్రయత్నించినా మేడా స్పందించలేదని స్పష్టం చేశారు. 

అయితే జిల్లా టీడీపీ నేతలు అబద్ధాలు చెప్తున్నారని సమావేశానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాపోతున్నారు మేడా. త్వరలోనే తాను చంద్రబాబు నాయుడిని  కలిసి వాస్తవాలు వివరిస్తానని స్పష్టం చేశారు. 

ఆ తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని ఆదివారం స్పష్టం చేశారు. అయితే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు

 

 

click me!