భర్త దుబాయిలో.. ప్రియుడితో వివాహిత రాసలీలలు.. చివరకు

Published : Jan 21, 2019, 12:26 PM IST
భర్త దుబాయిలో..  ప్రియుడితో  వివాహిత రాసలీలలు.. చివరకు

సారాంశం

కుటుంబం కోసం కష్టపడటానికి భర్త దుబాయి వెళితే.. తన కోరికలు తీర్చుకోవడానికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 

కుటుంబం కోసం కష్టపడటానికి భర్త దుబాయి వెళితే.. తన కోరికలు తీర్చుకోవడానికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరకు.. పిల్లలను అనాథలను చేసి.. ఆ ప్రియుడి చేతిలోనే ప్రాణాలను పోగొట్టుకుంది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... టెక్కలి మండలం బలరాంపురం గ్రామానికి చెందిన లక్ష్మి(34) వివాహమై.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త.. పొట్టకూటి కోసం దుబాయి వెళ్లాడు. అక్కడ కష్టపడి సంపాదిస్తూ.. భార్యకు డబ్బులు పంపేవాడు. రెండు సంవత్సరాలకి ఒకసారి గ్రామానికి వచ్చివెళ్లేవాడు.

కాగా.. లక్ష్మికి కొంత కాలం క్రితం గ్రామానికి చెందిన భాస్కర్ రావు అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త.. వివాహేతర సంబంధానికి దారితీసింది. కాగా.. ఇటీవల భాస్కర్ రావు కి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం లక్ష్మికి తెలియడంతో.. అతనితో ఘర్షణకు దిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

లక్ష్మి బతికి ఉంటే.. తనకు పెళ్లి కాకుండా అడ్డుపడుతందనే కారణంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని దూరంగా సంచిలో కట్టేసి రాళ్ల గుట్టల మధ్య పడేశాడు. తర్వాతి రోజు పెట్రోల్ తీసుకుపోయి శవానికి నిప్పు అంటించాడు. ఈలోగా లక్ష్మి కనిపించడం లేదంటూ.. ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు తనను ఎలాగైనా పట్టుకుంటారనే భయంతో భాస్కర్ రావు.. తనంతట తానే పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu