అమరావతిని అలా చూడాలన్నదే జగన్ కోరిక... ఇంతకు ఇంతా అనుభవిస్తారు.: సోమిరెడ్డి ధ్వజం

Arun Kumar P   | Asianet News
Published : Nov 25, 2021, 08:43 AM ISTUpdated : Nov 25, 2021, 08:45 AM IST
అమరావతిని అలా చూడాలన్నదే జగన్ కోరిక... ఇంతకు ఇంతా అనుభవిస్తారు.: సోమిరెడ్డి ధ్వజం

సారాంశం

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్రలో టిడిపి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. 

నెల్లూరు: అమరావతిని శిథిలంగా చూడటమే సీఎం జగన్మోహన్ రెడ్డి కోరికగా కనిపిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రాజధాని కోసం పోరాడే మహిళలపై కొందరు మంత్రుల కామెంట్స్ చూస్తే వారికి మానవత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. అమరావతి రైతులది చారిత్రాత్మక పాదయాత్ర... రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం చేపట్టిన పాదయాత్ర అని somireddy chandramohan reddy కొనియాడారు.  

nellore district లో జరుగుతున్న అమరావతి రైతు మహా పాదయాత్రలో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు రైతులు, మహిళలతో కలిసి కొద్దిదూరం నడిచారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ... న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు జరిగే అమరావతి రైతుల పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం కోసం శాంతి పోరాటం ఎలా సాగిందో అదే తరహాలో amaravati కోసం మరో పోరాటం జరుగుతోందన్నారు. 

''విరామం లేకుండా 700 కిలోమీటర్లకు పైగా పట్టుదలతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర బిందువైన అమరావతిని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు నిష్పక్షపాతంగా రాజధానిగా ఏర్పాటు చేశారు. అయితే chandrababu హయాంలో అమరావతిలో కట్టిన భవనాలను శిథిలాలుగా చూడాలన్నది ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి కోరిక'' అని మండిపడ్డారు. 

 read more రైతుల పాదయాత్రలో బీజేపీ నేతలు.. ‘రాజధానిగా అమరావతికే మద్దతు’

''చంద్రబాబు హయాంలో లక్షల మందికి కట్టిన టిడ్కో ఇళ్లల్లో పేదలు ఉండకూడదా...? అత్యాధునిక టెక్నాలజీతో చేపట్టిన నిర్మాణాలు శిథిలాలు అయిపోవాలా? ఎవరికోసమో పక్షపాతంగా అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయలేదు.సెంటర్ ఆఫ్ ది ప్లేస్ గా 13 జిల్లాకు అనువుగా ఏర్పాటు చేశారు. ప్రతిపక్షంలో వుండగా వైసిపి కూడా శాసనసభ సాక్షిగా అమరావతికి మద్దతు పలికింది. ప్రధాని చేత శంకుస్థాపన చేసి, చట్టప్రకారం ఏర్పాటు చేసిన రాజధానికి ప్రభుత్వం అడ్డం తిరగడం దుర్మార్గం'' అని సోమిరెడ్డి అన్నారు. 

''స్వాతంత్ర్య ఉద్యమాల గురించి పుస్తకాల్లోనే చదివాం... ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. రాజధాని కోసం వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు, వారి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవించక తప్పదు'' అని హెచ్చరించారు. 

''రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం కళ్లు మూసుకొని ప్రవర్తిస్తోంది. అన్ని పార్టీలు, ఐదు కోట్ల మంది ఆంధ్రులు అమరావతిని రాజధానిగా మద్దతు తెలిపినా వైసీపీ ప్రభుత్వం మాత్రం వ్యతిరేకిస్తోంది. ఏది ఏమైనప్పటికీ అమరావతిని రాజధానిగా సాధించి తీరుతాం'' అని సోమిరెడ్డి స్పష్టం చేసారు. 

read more  మడమ తిప్పడం, మాట మార్చడమే జగన్ నైజం: చిత్తూరులో చంద్రబాబు

''మాటతప్పం మడమ తిప్పం అని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపి ఇప్పుడు అడ్డం తిరగడం కరెక్ట్ కాదు. భవనాలు కూల్చడం, జనాలపై తప్పుడు కేసులు పెట్టి లోపల వేయటం, ఇది వైసీపీ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పాలన. ఆ భగవంతుడు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని క్షమించడు. ఓటు వేసి ముఖ్యమంత్రిని చేసినంత మాత్రాన మానవ హక్కులకు భంగం కలిగేలా... ప్రజల ఆస్తికి నష్టం వాట్టిలేలా చర్యలు తీసుకునే హక్కు మీకు లేదు'' అని వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?