క్రాప్ హాలీడే చెప్పడానికి మీరెవరు.. ఈ డ్రామాలెందుకో మాకు తెలుసు: కన్నబాబుపై నిమ్మల ఫైర్

By Siva KodatiFirst Published Nov 24, 2021, 8:51 PM IST
Highlights

కోతి, పైగా కల్లుతాగింది అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల పరిస్థితి ఉందంటై సెటైర్లు వేశారు టీడీపీ (tdp) ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (nimmala rama naidu) . వరి సాగు వద్దు, వరి పంట పండించొద్దు, వ్యవసాయానికి స్వస్తి పలకమని కన్నబాబుకు చెప్పే హక్కు ఎవరిచ్చారని నిమ్మల ప్రశ్నించారు. 

కోతి, పైగా కల్లుతాగింది అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల పరిస్థితి ఉందంటై సెటైర్లు వేశారు టీడీపీ (tdp) ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (nimmala rama naidu) . బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యవసాయశాఖ మంత్రి (ap agriculture minister) కన్నబాబు (kannababu) పంట విరామం, వ్యవసాయానికి స్వస్తి పలకండని పిలుపునివ్వటం సిగ్గుగా వుందంటూ దుయ్యబట్టారు. వరి సాగు వద్దు, వరి పంట పండించొద్దు, వ్యవసాయానికి స్వస్తి పలకమని కన్నబాబుకు చెప్పే హక్కు ఎవరిచ్చారని నిమ్మల ప్రశ్నించారు. రైతులకివ్వాల్సిన నష్టం, ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటి రాయితీలనుండి తప్పించుకునేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని రామానాయుడు ఆరోపించారు. 

అసమర్థ, చేతకాని పాలనను కప్పిపుచ్చుకోవడానికి,  మీ స్వలాభం కోసం రైతులకు శిక్ష వేస్తారా అని ఆయన మండిపడ్డారు. ఈ రెండున్నర సంవత్సరాలుగా రైతులు వ్యవసాయం చేయలేకపోతున్నారని.. పంట పండించి నష్టపోతున్నారని నిమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి కేంద్రం సైతం తలొగ్గింది, మీరెంత అంటూ ఆయన దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో ప్రజల ధన, ప్రాణ, మానానికి రక్షణ లేకుండా పోయిందని నిమ్మల ఆరోపించారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం, పారిశ్రామికంగా పరిశ్రమలు అవసరయని... రాష్ట్రంలో పరిశ్రమలేమైపోయాయో అందరికీ తెలుసునంటూ ఆయన ఎద్దేవా చేశారు. 

Also Read: టీడీపీ కార్యకర్త సైదాపై దాడి: తాలిబాన్లను మించిపోతున్నారంటూ.. వైసీపీపై అచ్చెన్న ఫైర్

రాష్ట్రంలో మంచి రహదారులు (ap roads), శాంతిభద్రతలు అవసరమని... పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుండి తరిమేస్తున్నారని, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. కనీసం గుంతలు పూడ్చడానికి కూడా ప్రభుత్వం పూనుకోవడంలేదని.. ప్రతిపక్షాలను అంతమొందించడానికి మాత్రమే పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఆదాయం వచ్చే రంగాన్ని పెంచుకుంటూ.. ఆదాయం రాని వాటిని తెంపుకుంటూ పోతున్నారని నిమ్మల దుయ్యబట్టారు. ఆఫ్గానిస్తానీయులకు (afghanistan) డ్రగ్స్ (drugs) , హెరాయిన్, గంజాయి (ganja) ఎలా అభివృద్ధికి వనరులయ్యాయో, ఏపీకి లిక్కర్ అలా మారిందని ఆయన అభివర్ణించారు. 

రాష్ట్రంలో లిక్కర్ మాల్స్, స్టోర్స్‌లను పెంచుకుంటూ పోతున్నారని... రైతు కన్నెర్ర చేసినా, రైతు కంట కన్నీరు పెట్టుకున్నా ప్రభుత్వాలే కూలిపోతాయని నిమ్మల జోస్యం చెప్పారు.  రైతుల పోరాటానికి తలొగ్గి  మూడు సాగు చట్టాలను (farm laws) కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలని ఆయన సూచించారు.  వైసీపీకి 151 సీట్లు ఇచ్చారనే అహంకారం, అహంభావం తగ్గలేదని...  వ్యవసాయానికి స్వస్తి పలకండనే పిలుపును వెనక్కి తీసుకోకపోతే రైతులే ప్రభుత్వానికి స్వస్తి పలుకుతారని నిమ్మల హితవు పలికారు. 

click me!