విశాఖలో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం... సీఐ మృతి, హోంగార్డుకు గాయాలు

By Arun Kumar PFirst Published Nov 25, 2021, 7:51 AM IST
Highlights

విశాఖపట్నంలో గురువారం అర్థరాత్రి పోలీస్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురయి త్రీ టౌన్ సీఐ మృత్యువాతపడ్డాడు. 

విశాఖపట్నం: విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా రోడ్డుప్రమాదానికి గురయి సీఐ మృత్యువాతపడిన విషాద సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం నుండి హోంగార్డు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు.  

వివరాల్లోకి వెళితే... visakhapatnam three town సీఐ కరణం ఈశ్వరరావు రోజూ మాదిరిగానే బుధవారం కూడా విధులకు హాజరయ్యారు. అయితే నైట్ రౌండ్స్ ముగించుకుని పోలీస్ వాహనంలోనే ఇంటికి వెళుతుండగా ఎండాడ ఏసీపీ కార్యాలయం వద్ద ప్రమాదానికి గురయ్యారు. గుర్తుతెలియని వాహనం అతివేగంతో వచ్చి పోలీస్ వాహనాన్ని ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. దీంతో సీఐ ఈశ్వరరావు తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  

road accident పై సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ఆదినారాయణ రావు, దిశా ఏసీపీ ప్రేమ్ కాజల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముందుగా గాయపడిన డ్రైవర్ ను, ఆ తర్వాత సీఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‎కు తరలించారు స్థానిక పోలీసులు. 

read more  వివాహామైన 24 గంటలకే విషాదం: అత్తారింటికెళ్తుండగా రోడ్డు ప్రమాదం, పెళ్లికుమారుడు మృతి.. కోమాలో వధువు

రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పీఎం పాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి ఉంటుందని లేదా ఈ వాహనమే వేరే వాహనాన్ని ఢీకొని ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు.

దొంగల చేతిలో ఎస్సై దారుణ హత్య 

మేకల దొంగల చేతిలో ఓ ఎస్సై దారుణ హత్యకు గురయిన దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది.  నావల్పట్టు పోలీసు స్టేషన్‌ పరిధిలో రాత్రిపూట  ఎస్సై భూమినాథన్ గస్తీ కాస్తుండగా టూ వీలర్‌పై మేకలను దొంగిలించి తీసుకెళ్తున్న కొందరు అటువైపు వచ్చారు. పోలీసులను చూసి మరింత వేగంతో బైక్ ను పోనివ్వడంతో అనుమానం వచ్చిన ఎస్సై వారిని ఛేజ్ చేసాడు. కొన్ని కిలోమీటర్ల దూరం తర్వాత వారిని పట్టుకోగలిగారు. 

read more  Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి..

అయితే ఆ దొంగలు ఎస్సై నుంచి తప్పించుకోవడానికి దారుణానికి ఒడిగట్టారు. ఒంటరిగా వున్న భూమినాథన్ మెడపై కత్తితో వేటు వేశారు. దీంతో ఎస్సై రక్తపు మడుగులో విలవిల కొట్టుకుంటుండగా ఆ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. కొంతసేపు ప్రాణాలలో విలవిల్లాడిన ఎస్సై చివరకు ప్రాణాలు కోల్పోయాడు. 

భూమినాథన్ హత్య కేసు ఛేదించడానికి నలుగురు సభ్యులతో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్ 24 గంటల్లో నిందితులను పట్టుకుంది. సీసీటీవీ ఫుటేజీ, ఆ లొకేషన్‌లో యాక్టివ్‌గా ఉండిన ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను వారు సులువుగా పట్టుకోగలిగారు. నిందితుడు మణికందన్ పుదుకొట్టయి జిల్లాలో ఎవరికీ చిక్కకుండా తలదాచుకున్నాడు. కానీ స్పెషల్ టీమ్ ఆయనను పట్టుకుంది. ఆ తర్వాత మేకల దొంగతనం కార్యకలాపాల్లో మరో ఇద్దరు మైనర్లూ ఉన్నట్టు పోలీసులకు తెలిసింది. వీరందరిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

 


 

click me!