టిడిపి అధికారంలోకి రాగానే... వారికి ఉచిత రిజిస్ట్రేషన్లు: నారా లోకేష్ హామీ

By Arun Kumar P  |  First Published Nov 26, 2021, 12:44 PM IST

జగనన్న శాశ్వత గృహ హక్కుల పథకం పేరిట ప్రజల నుండి వందలకోట్లు దోచుకునేందుకు జగన్ సర్కార్ స్కెచ్ వేసినట్లు టిడిపి నాయకులు నారా లోకేష్ ఆరోపించారు. 


అమరావతి: వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా ఇంటిపై సర్వహక్కులు పొందవచ్చంటూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరిట భారీ దోపీడీకి జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ తప్పనిసరి కాదంటూనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని  లబ్దిదారులు వాపోతున్నారని లోకేష్ పేర్కొన్నారు.

''జగన్ రెడ్డి జలగలా ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాడు. ఎన్టీఆర్ గారి హయాం నుండి వివిధ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన పక్కా ఇళ్లకు రిజిస్ట్రేషనంటూ రూ.1500 కోట్లు కొట్టేసే స్కెచ్ వేసారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా కట్టొద్దు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం'' అని nara lokesh హామీ ఇచ్చారు.

Latest Videos

undefined

ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి జగన్ సర్కార్ వన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా ఇళ్లపై హక్కులు కల్పించేందుకు  Jagananna Permanent House Rights Scheme ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్‌మెంట్‌ సొమ్మును చెల్లించి గతంలో వివిధ ప్రభుత్వాల హయాంలో పొందిన ఇళ్లపై శాశ్వత హక్కులు పొందవచ్చని ప్రభుత్వం సూచిస్తోంది. 

read more  Nara Bhuvaneswari: అసెంబ్లీలో అవమానంపై ఏపి ప్రజలకు బహిరంగ లేఖ

గ్రామ, వార్డు సచివాలయాల్లో one time settlement అర్హుల జాబితా ప్రదర్శించనున్నట్లు... పేరు ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు వుంటాయని అధికారులు తెలిపారు. అయితే సొంతింటి కల పేరిట ప్రజల నుండి వందల కోట్లు దోచేయాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని టిడిపి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే tdp అధికారంలోకి రాగానే ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

ఇదిలావుంటే Andhra pradesh లోని పలు పంచాయితీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు మాయమయ్యాయంటూ ఇటీవల లోకేష్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొన్ని పంచాయితీల ఖాతాల్లో నిధులు తగ్గిపోగా, మరికొన్ని పంచాయితీల ఖాతాల్లో అయితే జీరో బ్యాలెన్స్ చూపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వమే పాలనా అవసరాల కోసం ఈ నిధులను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై   లోకేష్ స్పందిస్తూ జగన్ సర్కార్ పై మండిపడ్డారు. 

read more  నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు,ప్రజల దృష్టి మరల్చేందుకే...: మూడు రాజధానుల చట్టం విత్‌డ్రా పై లోకేష్

''వ్యవస్థల విధ్వంసానికి జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. పల్లె పోరు లో ఫ్యాన్ కి ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న cm jagan reddy ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని nara lokesh అన్నారు. 

''గతంలో 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి విద్యుత్ బకాయిలంటూ రూ.345 కోట్లు కట్ చేసారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లను ప్రభుత్వం పక్కదారి పట్టించడం గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమే. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులతో గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తరువాత ఖాతాల్లో సొమ్ము జీరో అయితే వారు ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? తక్షణమే ప్రభుత్వం మళ్లించిన సొమ్ముని పంచాయతీల ఖాతాల్లో వెయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేసారు.
 

click me!