నీ భార్యను ఏమీ అనలేదు సామీ అంటే వినవే...శృతిమించుతున్నావ్..: చంద్రబాబుపై మంత్రి నాని సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : Nov 26, 2021, 11:42 AM IST
నీ భార్యను ఏమీ అనలేదు సామీ అంటే వినవే...శృతిమించుతున్నావ్..: చంద్రబాబుపై మంత్రి నాని సీరియస్

సారాంశం

చంద్రబాబు భార్య భువనేశ్వరి తాము ఏమీ అనలేదని... అయినా పదేపదే మేము అనని మాటలు అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. 

అమరావతి: ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనపై మంత్రి పేర్ని నాని సెటైర్లు విసిరారు. వరద బాధితులను ఓదార్చడానికి వెళ్లిన చంద్రబాబు తనని ఓదార్చమంటున్నాడని ఎద్దేవా చేసారు. బాధితుల సమస్యలేమైనా వుంటే తెలుసుకుని ప్రభుత్వానికి తెలపాలి... అంతేగానీ రాజకీయాలు చేయడం తగదని చంద్రబాబుకు మంత్రి నాని సూచించారు.   

''మేము నీ భార్య nara bhuvaneshwari ని ఏమీ అనలేదు సామీ అన్నా chandrababu naidu వినడం లేదు. నిన్ను తిడతాం కానీ నీ భార్యను అనాల్సిన అవసరం ఏముంది. మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు. మా YSRCP కార్యకర్త నుంచి మేము ప్రేమ బంధాలకు ప్రాధాన్యం ఇస్తాం. అలాంటిది చంద్రబాబు సతీమణి గురించి అసెంబ్లీలో అవమానకరంగా ఎలా మాట్లాడతాం'' అని minister perni nani పేర్కొన్నారు. 

''చంద్రబాబు మాటలు శృతిమించాయి. ముఖ్యమంత్రి జగన్ గాల్లో కలిసిపోతాడు అంటున్నాడు. నీ కొడుకు వయసున్న cm jagan ని పట్టుకుని అలా మాట్లాడొచ్చా. నువ్వు మాత్రం ఎన్నేళ్లయినా బతకొచ్చా..? సభ్యసమాజం ఏమనుకుంటుంది అనే ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు'' అని నాని మండిపడ్డారు. 

read more  ఇలాంటి భర్త, కొడుకు ఉండటం ఆమె దురదృష్టం.. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్...

''TDP హయాంలో వరదలోచ్చినప్పుడు నువ్వు ఎక్కడ తిరిగావ్? ఆ రోజు హెలికాఫ్టర్ లో టిఫిన్లు చేస్తూ తిరిగావు. ఇప్పుడు కనీసం మోకాళ్ళ లోతు నీళ్లు లేని చోట పడవలో తిరుగుతున్నాడు. అయినా బాధితుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తోంది... అలాంటిది చంద్రబాబు పర్యటన అవసరమేముంది'' అన్నారు.  

''ఇప్పుడు ప్రజలకు ఏ భోజనం పెడుతున్నారో అదే భోజనం అధికారులను తినమని సీఎం జగన్ చెప్పారు. బాధిత ప్రజల కోసం ఇంతచేస్తుంటే ఇంకే కావాలి.  కేవలం కడుపు మంటతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ కడుపు మంటతోనే ఆయన సచ్చిపోయేట్లు ఉన్నాడు. అయినా ఆయనకు ఎందుకంత ఈర్ష, ద్వేషమో అర్థంకావడం లేదు. ఇంట్లో వాళ్ళు ఆయనకి చెప్పడం లేదు... కనీసం పార్టీ వాళ్ళు అయినా చెప్పండి'' అని నాని సెటైర్లు వేసారు.

''గతంలో చంద్రబాబు హయాంలో పుష్కరాల సందర్భంగా షూటింగ్ కోసం ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం మానవ తప్పిదం అంటే. ఒక పబ్లిసిటీ పిచ్చి వల్ల 31 ప్రాణాలు పోయాయి. కానీ ఫ్లాష్ ఫ్లడ్ వస్తే అక్కడ మానవ తప్పిదం ఏముంది. ఇలానే ఉంటే మరోసారి ప్రజలు తెడ్డు కాల్చి వాతలు పెడతారు'' అని చంద్రబాబును హెచ్చరించారు. 

read more వైఎస్సార్ మృతిపై చంద్రబాబుపై అనుమానాలు... ఇప్పుడు జగన్ పై కూడా..: ఎంపీ మోపిదేవి షాకింగ్ కామెంట్స్ (వీడియో)

''చంద్రబాబు చిల్ బుల్ బాబా... ఆయన తనయుడు లోకేష్ బ్యాటింగ్ బాబా... వీళ్ళు వందేళ్లు బ్రతుకుతారా. చంద్రబాబు ఇకనైనా ప్రస్టేషన్ తగ్గించుకుంటే మంచిది. సీఎం జగన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడానంటే కుదరదు'' అని మంత్రి నాని హెచ్చరించారు. 

ఇక వైసిపి ఎమ్మెల్యే రోజా కూడా చంద్రబాబు వరద ప్రాంతాల పర్యటనపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వరద బాధితుల దగ్గర బురద రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. కుప్పం దెబ్బకు చంద్రబాబు కు పిచ్చెక్కిందని... అందుకే ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదంటూ mla roja సెటైర్లు వేసారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్