ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఏపీ ప్రజలకు భువనేశ్వరి బహిరంగ లేఖ రాశారు. తనకు జరిగిన అవమానం మరొకకిరి జరగకూడదని ఆమె అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆమె బహిరంగ లేఖ రాశారు. తనపై ఏపి అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసినవారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన అవసమానం మరొకరికి జరగకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.
తనపై జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్లుగా భావించారని Nara Bhuvaneswari తన బహిరంగ లేఖలో అన్నారు. తనకు ప్రజలు అండగా నిలబడడం జీవితంలో మరిచిపోలేనని ఆమె అన్నారు.అమ్మానాన్నలు తమను చిన్ననాటి నుంచి విలువలతో పెంచారని, నేటికీ తాము ఆ విలువలను పాటిస్తున్నామని ఆమె చెప్పారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె అన్నారు. NTR మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పేరు మీద ఆమె ఆ బహిరంగ లేఖ రాశారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పక్షానికి చెందిన కొంత మంది చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో నారా భువనేశ్వరిని కూడా లాగారు.
Also Read: నీ భార్యను ఏమీ అనలేదు సామీ అంటే వినవే...శృతిమించుతున్నావ్..: చంద్రబాబుపై మంత్రి నాని సీరియస్
దానికి Nara Chandrababu Naidu తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తీవ్రమైన భావోద్వేగానికి గురైన చంద్రబాబు మీడియా సమావేశంలో కంటతడి కూడా పెట్టుకున్నారు. వెక్కి వెక్కి విలపించారు. నారా భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలకు వారు ఓణీల ఫంక్షన్ నిర్వహించారు.
తన కుటుంబంపై, సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మనోవేదనకు గురైన చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు చూడలేదని అన్నారు. ఆ సంఘటనపై ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని ఆనయ అన్నారు. క్షేత్ర స్ధాయిలో వైఎస్సార్ కాంగ్రెసు మీద తేల్చుకున్న తర్వాతనే తాను తిరిగి అసెంబ్లీలో అడుగుపెడుతానని, ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి వస్తానని, అంత వరకు అసెంబీ సమావేశాలకు హాజరు కాబోనని ఆయన అన్నారు.
Also Read: ఇలాంటి భర్త, కొడుకు ఉండటం ఆమె దురదృష్టం.. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్...
కాగా, టీడీపీ నేతల విమర్శలను కొట్టిపారేసేందుకు వైఎస్సార్ కాంగ్రెసు నేతలు, మంత్రులు ప్రయత్నిస్తున్నారు. తాము చంద్రబాబు భార్య భువనేశ్వరిని ఏమీ అనలేదని తాజాగా మంత్రి పేర్ని నాని శుక్రవారంనాడు అన్నారు. తాము భువనేశ్వరిని ఏమీ అనలేదని చెప్పినా చంద్రబాబు వినడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబును తిడుతాం గానీ ఆయన సతీమణిని అనబోమని మంత్రి అన్నారు. తమ ఇళ్లలోనూ ఆడవాళ్లు ఉన్నారని, తమ వైసీపీలో కార్యకర్త స్థాయి నుంచి తాము ప్రేమ బంధాలకు ప్రాధాన్యం ఇస్తామని, అలాంటిది చంద్రబాబు సతీమణి గురించి అవమానకరంగా ఎందుకు మాట్లాడుతామని ఆయన అన్నారు.
ఏపీ అసెంబ్లీలో అవమానం: ఏపీ ప్రజలకు నారా భువనేశ్వరి బహిరంగ లేఖ pic.twitter.com/N4xLqCvwwB
— Asianetnews Telugu (@AsianetNewsTL)