పోలవరం ప్రాజెక్టు అంశంమీద టీడీపీ నేత దేవినేని ఉమ వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. రివర్స్ టెండరింగ్ అంటూ డ్రామాలాడి.. పోలవరాన్ని సంకనాకిచ్చారని దుమ్మెత్తిపోశారు.
విజయవాడ : Polavaram project నిర్మాణ సంస్థని మార్చి సరిదిద్దుకోలేని తప్పు చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి Devineni Umamaheswara Rao విరుచుకుపడ్డారు. 50 లక్షల క్యూసెక్కుల వరదని తట్టుకునే విధంగా టీడీపీ ప్రభుత్వం స్పిల్ వే నిర్మాణం చేపడితే.. అది వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ధ్వంసమయ్యిందన్నారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల, సరైన ప్రణాళిక, సమన్వయం లేకపోవడంతో పోలవరం నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. ముఖ్యంగా నిధుల కొరత వల్ల పోలవరం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని చంద్రబాబునాయుడు 7 శాతం ఉన్న ప్రాజెక్టును 72 శాతానికి తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు.
అంతేకాదు, కేంద్రం నుంచి రూ.6,500 కోట్లు నిధులు తెచ్చారు. కానీ, వైసీపీ ప్రభుత్వం సరైన అవగాహన లేక ఇష్టారాజ్యంగా వ్యవహరించి 2,742 కోట్లు దుబారా చేసింది. పోలవరం ముంపువాసులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసే స్థాయికి తెచ్చారు. పోలవరం 7 ముంపు మండలాల్ని ఏపీలో కలిపితే పోలవరం కలసాకారం అవుతుందని చంద్రబాబు భావించి, కేంద్రంతో ఒప్పించి 7 ముంపు మండలాల్ని ఏపీలో చేర్చారన్నారు.
undefined
రాజకీయంగా ప్రతిపక్షాలతో పోటీ పడలేకే.. : తెలంగాణ మంత్రుల కామెంట్స్‌పై స్పందించిన ఆదిమూలపు సురేష్
ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ డ్రామా వల్ల పోలవరం నిర్మాణం సంకనాకింది. నిర్మాణ పనులు రెండు ఏజెన్సీలకు ఇస్తామని చెప్పి ఒక ఏజెన్సీకి ఇచ్చి తప్పు చేశారు. నిపుణుల కమిటి గడ్డి పెట్టినా ముఖ్యమంత్రి మీడియా ముందుకు రాలేదు. మన భూభాగంలోని పోలవరానికి చెందిన గ్రామాలను ధారాదత్తం చేయడానికి సీఎం సిద్ధపడ్డాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. పరిపాలనా వైఫల్యంతో అప్పర్ కాపర్ డ్యామ్ లో గ్యాపులను ఫిలప్ చేయకుండా స్పిల్ వే నిర్మాణం చేసి నిర్మాణ పనులు నీరుగార్చారని దుమ్మెత్తిపోశారు.
ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభం చేయకపోవడం పెద్ద తప్పు, లయర్ కాపర్ డ్యామ్ ఎత్తు పెంచకపోవడం మరో తప్పు.. వైసీపీ ప్రభుత్వం నిర్లక్షంతోనే విధ్వంసం జరిగిందని ఐఐటి నిపుణులు తేల్చి చెప్పారు. జూన్, జులైలో వరదలొస్తాయని తెలియని మంత్రులు రాష్ట్రంలో ఉండడం దౌర్భాగ్యం.. పోలవరం ముంపువాసులు 37యేళ్లుగా మొత్తుకుంటున్నా.. వారికి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. పోలవరం విషయంలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉంది అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.