విజయవాడలో షాకింగ్.. సిమెంట్ లారీలో కుళ్లిన మృతదేహం..

By SumaBala Bukka  |  First Published Jul 25, 2022, 12:12 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సిమెంట్ లారీలో కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని టోల్ ప్లాజా సిబ్బంది కనుగొన్నారు. 


విజయవాడ : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు టోల్ ప్లాజా దగ్గర సిమెంట్ లారీలో మృతదేహం కలకలం రేపింది. సిమెంట్ లారీలో కుళ్లిపోయి, పురుగులు పట్టిన మృతదేహం లభించింది. దీన్ని టోల్ ప్లాజా సిబ్బంది గుర్తించారు. సిమెంట్ లారీ నుంచి భయంకరమైన దుర్వాసన రావడంతో టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మృతుడు విజయవాడకు చెందిన షేక్ మస్తాన్ (45)గా గుర్తించారు. రాజమంత్రి సిమెంటు లోడు దిగుమతికి వెళ్లి విజయవాడ వస్తుండగా సంఘటన జరిగింది. 19న సిమెంట్ లోడుతో డ్రైవర్ మస్తాన్ రాజమండ్రికి బయలుదేరి వెళ్లాడు. విషయం తెలిసిన వెంటనే హనుమాన్ జంక్షన్ సీఐ సతీష్ సంఘటన స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో పూర్తి దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉండగా, జూన్ 28న అమెరికాలో టెక్సాస్ లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఓ ట్రాక్టర్-ట్రైలర్‌లో కనీసం 40 మంది చనిపోయి కనిపించారని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి తెలిపారు. శాన్ ఆంటోనియోలోని స్థానిక KSAT టెలివిజన్ కథనం ప్రకారం.. ఓ ట్రక్కులో 42 మంది మరణించి ఉన్నట్లు కనుగొన్నారని రిపోర్ట్ చేశారు. శాన్ ఆంటోనియో నగరం దక్షిణ శివార్లలోని మారుమూల ప్రాంతంలో రైలు పట్టాల పక్కన ఈ ట్రక్కు కనిపించిందని KSAT తెలిపింది. 

Latest Videos

undefined

ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహాలు.. అవి ఆత్మహత్యలు కాదు హత్యలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

దీనిమీద స్పందించడానికి శాన్ ఆంటోనియో పోలీసులు వెంటనే అందుబాటులోకి రాలేదని తెలిపింది. ఇక ఈ ఘటన మీద KSAT రిపోర్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటోలలో పెద్ద ట్రక్కు..దాని చుట్టూ పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లను కనిపిస్తున్నాయి. మెక్సికన్ సరిహద్దు నుండి 160 మైళ్ళు (250 కిమీ) దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోలో ఉష్ణోగ్రతలు సోమవారం అధిక తేమతో 103 డిగ్రీల ఫారెన్‌హీట్ (39.4 డిగ్రీల సెల్సియస్) వరకు పెరిగాయి.

కాగా, జోహన్స్ బర్గ్ లోని ఓ నైట్ క్లబ్ లో 21 మంది టీనేజర్లు ఒకేసారి మృత్యవాత పడ్డారు. వీరిలో అత్యంత పిన్నవయసు 13యేళ్లు. వీకెండ్ లో దక్షిణాఫ్రికాలోని టౌన్‌షిప్ టావెర్న్‌లో ఒక నైట్ అవుట్ తరువాత వీరంతా చనిపోయారు. అయితే మరణాలకు గల కారణాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. విద్యార్థులు తమ హైస్కూల్ పరీక్షలు అయిపోయిన సందర్భంగా శనివారం రాత్రి పార్టీ చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. 

అయితే, ఈ దుర్ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. కానీ ఆశ్చర్యంగా మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. తొక్కిసలాట వల్ల చనిపోయి ఉంటారేమో అనే అంశాన్ని అధికారులు తోసిపుచ్చారు. మరణాలు విషప్రయోగం వల్ల జరిగి ఉండొచ్చేమో అనే అనుమానం.. శవపరీక్షల ఫలితాలు వస్తే కానీ చెప్పలేమన్నారు.

ఘటన గురించి తెలియడంతో.. పిల్లల తల్లిదండ్రులతో సహా.. పెద్ద ఎత్తున జనం ఆదివారం తూర్పు లండన్ లో విషాదం జరిగిన క్లబ్ వెలుపల గుమిగూడారు. అయితే పోలీసులు ఎవ్వరినీ అనుమతించలేదు. మార్చురీ వాహనాలు మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం తరలించాయి. ఈ విషయం తెలియగానే సీనియర్ ప్రభుత్వ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. వీరిలో నేషనల్ పోలీసు మినిస్టర్ భేకీ సెలే కూడా ఉన్నారు. ఆయన మృతదేహాలను భద్రపరిచిన గదిని పరిశీలించిన తరువాత బయటకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. 

click me!