నాలుగు లక్షలు పలికిన.. ఎనిమిది నెలల వయసున్న పుంగనూరు ఆవు..

Published : Jul 25, 2022, 08:31 AM IST
నాలుగు లక్షలు పలికిన.. ఎనిమిది నెలల వయసున్న పుంగనూరు ఆవు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో ఎనిమిదినెలల వయసున్న ఓ పుంగనూరు ఆవు నాలుగు లక్షల రూపాయల ధర పలికింది. దీంతో దీని యజమాని సంతోషానికి హద్దులు లేవు. 

తెనాలి : తన వద్ద ఉన్న 8 నెలల Punganur cow జాతి తొలిచూడి ఆవుపెయ్య రూ.4.10 లక్షల ధర పలికినట్లు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి కంచర్ల శివకుమార్ తెలిపారు. ఆదివారం ఇక్కడి Veterinary Hospitalలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యోగా గురువు Baba Ramdev దీన్ని కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆ జాతి వీర్యం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో లభ్యమవుతుందని, తమ ఆవులకు ఇక్కడే వీర్య ఇంజక్షన్ చేయించినట్లు చెప్పారు. తనవద్ద ఒంగోలు, పుంగనూరు, గిర్ ఇతర జాతుల ఆవులు 100 వరకూ ఉన్నట్లు ఆయన తెలిపారు. 

పశువైద్యశాల సహాయ సంచాలకుడు బొంతు నాగిరెడ్డి మాట్లాడుతూ... ఈ జాతి ఆవులకు చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రసిద్ధి చెందిందని, ఇవి ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు కలిగిన ఆవులని అన్నారు. అంతేకాదు వీటి పోషణకు చాలా తక్కువ స్థలం సరిపోతుందని.. తెలిపారు. ఇవి తక్కువ దాణా తీసుకుంటూ పూటకు 3 లీటర్ల చొప్పున పాలు ఇస్తాయి అని తెలిపారు.

పంచాయతీ కార్యదర్శి భవాని ఆత్మహత్య కేసు : వైసీపీ నాయకుడు, మరో ఇద్దరి అరెస్ట్..

ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఆవుల మంద అడవి పందులు చూసి బెదిరిపోయింది. దీంతో వందలాది ఆవులు తెలుగుగంగ జలాశయంలో దూకాయి. ఈ ఘటన గత శుక్రవారం నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద చోటుచేసుకుంది. ఇలా పడిన వాటిలో 400 గోవులను మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో 50 ఆవులు గల్లంతయ్యాయి. వెలుగోడుకు చెందిన మల్లయ్య, శంకర్, ఆర్ వెంకటరమణ, కూర్మయ్య, పెద్ద స్వామి, బాలలింగం,  ఈశ్వర్, మురుగయ్య, సాంబకోటి సుమారు వెయ్యి ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం వీరు గ్రామ సమీపంలోని తెలుగుగంగ జలాశయం పక్కనున్న మైదాన ప్రాంతంలో ఆవుల మందను నిలిపారు.  

ఆ సమయంలో అటువైపు ఒక అడవి పందుల గుంపు పరుగులు తీస్తూ వచ్చింది. ఇది చూసిన ఆవులు తీవ్రంగా బెదిరి పోయాయి. దీంతో కాపరులు ఆపుతున్నా వినలేదు. భయంతో పరుగులు పెట్టాయి. సుమారు ఐదువందల ఆవులు జలాశయం కట్టపైకి చేరాయి. 50 వరకు అడవిలోకి పరుగులు తీయగా… మరో 450 వరకు జలాశయంలోకి దూకేశాయి. వాటి యజమానులు మత్స్యకారుల సహాయంతో నాటు పడవలు పుట్టిలపై జలాశయంలోకి వెళ్లి  ఒడ్డుకు తోలుకుంటూ వచ్చారు. సి ఐ., ఎస్సైలు జలాశయంలోకి పుట్టిపై వెళ్లి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్