సీఎం జగన్ పరిస్థితి కూడా డేరా బాబా లాగే..: బుద్దా వెంకన్న సంచలనం (వీడియో)

Published : Jun 01, 2023, 02:32 PM ISTUpdated : Jun 01, 2023, 02:33 PM IST
సీఎం జగన్ పరిస్థితి కూడా డేరా బాబా లాగే..: బుద్దా వెంకన్న సంచలనం (వీడియో)

సారాంశం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా డేరా బాబా మాదిరిగా తయారయ్యిందని టిడిపి నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేసారు. 

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది పక్కా క్రిమినల్ మైండ్ అని టిడిపి నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. డేరా బాబాలా మాదిరిగానే జగన్ పరిస్థితి తయారయ్యిందంటూ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగినా టిడిపి గెలుపు ఖాయమని... జగన్ తాడేపల్లి కొంప వెనకనుండి పారిపోవడం ఖాయమన్నారు. ఒక్కసారి సీఎం పదవినుండి జగన్ దిగిపోయాడంటే ఇక వైసిపి పార్టీయే వుండదని బుద్దా వెంకన్న అన్నారు. 

వైఎస్ వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై వెంకన్న స్పందించారు. గతంలో చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలతో పాటు న్యాయవ్యవస్థను కూడా మేనేజ్ చేస్తాడన్న వైసిపి నాయకులు వ్యాఖ్యలను వెంకన్న గుర్తుచేసారు. అవినాష్ రెడ్డికి కూడా న్యాయవ్యవస్థను మేనేజ్ చేస్తేనే బెయిలు వచ్చిందా? అని ప్రశ్నించారు.వ వివేకా హత్య సమయంలో టిడిపిపై నిందలు వేసారు... కాబట్టే ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకున్నామని అన్నారు. అవినాష్ బెయిల్ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. తల్లిని అడ్డం పెట్టుకుని అవినాష్ అరెస్ట్ నుండి తప్పించుకున్నారు... కానీ ఎప్పటికైనా నిందితులు శిక్ష అనుభవించాల్సిందేనని వెంకన్న అన్నారు. 

వీడియో

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల టిడిపి చీఫ్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు వెంకన్న కౌంటరిచ్చారు. భద్రతా సిబ్బంది లేకుంటే చంద్రబాబును ఫినిష్ చేస్తారా? అంత దమ్ముందా? అంటూ సవాల్ విసిరారు. టిడిపీలో వుండి చంద్రబాబు సొమ్ముతో పందికొక్కులా తయారైన తమ్మినేని ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు...ఇలాంటి కుక్కలు చేసే విమర్శలను పట్టించుకోమని అన్నారు. కృష్ణా జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రలో కూడా కొన్ని కుక్కలు మొరుగుతున్నాయ్... ఆ లెక్కలన్నీ త్వరలోనే సరిచేస్తామని అన్నారు. టిడిపిలోనుండి తరిమేస్తే వైసిపిలోకి వెళ్లిన తమ్మినేని ఆక్రోశంతో మాట్లాడుతున్నాడని వెంకన్న అన్నారు. 

Read More  జగన్ సీఎంగా విఫలమైనా ముద్దాయికి అన్నగా సఫలమయ్యారు..: వర్ల రామయ్య

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆముదాలవలసలో తమ్మినేనిపై టిడిపి అభ్యర్థి  కూన రవికుమార్ గెలవడం ఖాయమని వెంకన్న జోస్యం చెప్పారు. ఒకవేళ తమ్మినేని గెలిచి టిడిపి ఓడిపోతే కూన రవికుమార్ రాజకీయాల నుండి తప్పుకుంటారు... ఇది ఆయన తరపున తాను చేస్తున్న సవాల్ అని వెంకన్న అన్నారు. తమ్మినేని తగిన సన్మానం చేస్తామని వెంకన్న హెచ్చరించారు. 

ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ విజయసాయి రెడ్డి అనకాపల్లి జిల్లా బయ్యవరంలో 600పైగా ఎకరాల్లో అక్రమ లేఅవుట్ వేసారని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆ లేఅవుట్ లో సగం భూములు ప్రభుత్వానివే కాబట్టి ప్రజలెవ్వరూ అందులోని ప్లాట్లు కొనొద్దని... టిడిపి అధికారంలోకి రాగానే  ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. 
 అధికారులను మేనేజ్ చెసి రికార్డ్స్ తారుమారు చేసి చివరకు రిజర్వాయర్ లో భూములను సైతం కొట్టేశసారని వెంకన్న ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్