రైతు సంక్షేమ ప్రభుత్వం మాది: వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన జగన్

By narsimha lode  |  First Published Jun 1, 2023, 1:03 PM IST

 తమ  ప్రభుత్వం  రైతుల  సంక్షేమం కోసం  కట్టుబడి ఉందని  ఏపీ సీఎం  వైఎస్ జగన్  చెప్పారు.  చంద్రబాబు సర్కార్  రైతుల  సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. 


కర్నూల్:రైతులు పంటల  పెట్టుబడికి ఇబ్బంది పడొద్దనే  కారణంగా  తమ ప్రభుత్వం  వైఎస్ఆర్  రైతు భరోసా  కార్యక్రమాన్ని చేపట్టిందని  ఏపీ సీఎం జగన్ చెప్పారు.వైఎస్ఆర్ రైతు భరోసా  పథకం కింద  52.30 లక్షల మంది  రైతుల  బ్యాంకు ఖాతాల్లో  రాష్ట్ర ప్రభుత్వం  గురువారంనాడు నిధులను  జమ చేసింది.  మొదటి విడతగా  ఒక్కో రైతుకు  రూ. 7,500 లను  రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు  విడుదల  చేసింది. 

వరుసగా  ఐదోసారి  వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం  కిసాన్ పథకం కింద  సీఎం జగన్  గురువారంనాడు   రైతులకు  నిధులను విడుదల  చేశారు.  ఈ సందర్భంగా  కర్నూల్  జిల్లా పత్తికొండలో  నిర్వహించిన  సభలో  ఆయన  ప్రసంగించారు. రైతులకు  తమ ప్రభుత్వం అండగా  ఉంటుందన్నారు.  రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ది  చెందుతుందన్నారు. గత  ప్రభుత్వం  రైతులను  మోసం  చేసిందని  జగన్  విమర్శించారు. చంద్రబాబునాయుడు  సీఎంగా  ఉన్న  సమయంలో  ప్రతి ఏటా  కరువే వచ్చిందని ఆయన గుర్తు చేశారు.   

Latest Videos

undefined

ఎన్నికల మేనిఫెస్టోలో  ఇచ్చిన ప్రతి హమీని నిలబెట్టుకుంటున్నామన్నారు సీఎం  జగన్. మేనిఫెస్టోలో  ప్రకటించిన దాని కంటే  ఎక్కువగా  రైతు భరోసా  అందిస్తున్నామని  సీఎం  జగన్  వివరించారు.ప్రతి రైతుకు  ఇప్పటివరకు  రైతు భరోసా  కింద  రూ.  54 వేలు ఆర్ధిక సహాయంగా అందించామని  సీఎం జగన్ వివరించారు.

also read:కాపీ కొట్టి పులిహోర వండారు: టీడీపీ మేనిఫెస్టోపై జగన్ ఫైర్

ఏ సీజన్ లో  పంట నష్టం జరిగితే  అదే  సీజన్ లో  రైతులకు  ఇన్ పుట్ సబ్సీడీని అందిస్తున్నామన్నారు. చంద్రబాబు  రైతుకు శతృవు అని  ఆయన  విమర్శించారు.  విత్తనం నుండి  రైతు పండించిన  ధాన్యం కొనుగోలు వరకు రైతుకు అండగా  నిలుస్తున్నామన్నారు. రైతు భరోసా  కేంద్రాల ద్వారా  తమ  ప్రభుత్వం  రైతులకు సహాయం  చేస్తున్న విషయాన్న సీఎం గుర్తు  చేశారు. 
 

click me!