
విశాఖపట్నం: తన సోదరుడు సీఎం జగన్ తో విభేదించి వైఎస్ షర్మిల తెలంగాణలో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో అధికారంలోకి రావడానికి షర్మిల సేవలను వినియోగించుకున్న జగన్ ఇప్పుడు ఆమెను పక్కనపెట్టడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో షర్మిలను జగన్ వెన్నుపోటు పొడిచాడంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
''ఒక చెల్లెమ్మకు కత్తిపోటు, మరో చెల్లెమ్మకు వెన్నుపోటు. రాష్ట్రంలో ఉన్న చెల్లెమ్మలకు గ్రహపాటు. ఇంత మందిని ముంచిన పాపం ఊరికే వదులుతుందా వైఎస్ జగన్?'' అంటూ ట్విట్టర్ వేదికన అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.
read more మోదీని దువ్వుతున్నావనుకున్నాం... ఏపీని అమ్మేసారా!: విజయసాయిపై అయ్యన్న సెటైర్లు
గతంలో కూడా జగన్ పైనే కాదు తండ్రి వైఎస్సార్, తాత రాజారెడ్డిలపై కూడా అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''హెలికాప్టర్లు, ప్రైవేట్ జెట్లలో తిరగటానికి 16 నెలల్లో రూ.26 కోట్లా? అదీ ప్రజాధనం? పోనీ పీకింది ఏమైనా ఉందా అంటే చీకట్లో ఢిల్లీ వెళ్ళటం, జైలుకి పోకుండా వేడుకోలు, జడ్జీల మీద ఫిర్యాదులు, కోర్టు ముందు హాజరు,పెళ్ళిళ్ళు,పేరంటాలు.. ప్రజల కోసం ఈ రూ.26 కోట్లతో మీరు పీకింది ఏంటి వైఎస్ జగన్'' అంటూ ట్విట్టర్ వేదికన నిలదీశారు.
''అధికారంలో ఉండి కూడా ఆధారాలు లేకుండా, ఇలా గాలి ఏడుపులు ఏడుస్తారు కాబట్టే మిమ్మల్ని గాలి మంద, ఫేక్ మంద అనేది. పావురాలగుట్టలో పావురం అయినోడు తన హెలికాప్టర్ తానే పేల్చుకున్నాడా? వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, కోడికత్తితో గుచ్చుకుని "అమ్మా అంటూ బిగ్గరగా కేక వేసిన జగన్" అని ఆడిన డ్రామాల సంగతి?'' అని ఎద్దేవా చేశారు.
''పట్టాభి తన మీద తానే దాడి చేసుకున్నారని బులుగు గొర్రెలు మొరుగుతున్నాయి. ముఖ్యంగా గుడివాడ గొర్రె, గన్నవరం గొర్రెల డాక్టర్. మరి కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్, బలపనూరులో బడి గంటలు కొడుతూ, బ్రీటీష్ వాళ్ళకు పంది మాంసం సప్లై చేసిన రాజా రెడ్డి, తన మీద తానే బాంబు వేసుకుని పోయాడా?'' అంటూ జగన్ కుటుంబంపై అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.