మొన్న అరకులో, నిన్న కర్నూల్ లో పలువురి ప్రాణాలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదాలను మరువక ముందే తాజాగా గుంటూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న అరకులో, నిన్న కర్నూల్ లో పలువురి ప్రాణాలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదాలను మరువక ముందే తాజాగా గుంటూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళుతున్న ఆటో బోల్తాపడి పలువురు కూలీలు గాయపడ్డారు.
ఈ ప్రమాదం దుర్గి మండలం పోలేపల్లి సమీపంలో చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలోని కూలీలు కొందరు తీవ్రంగా గాయపడగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆటోలో 12మంది కూలీలున్నారు. ఆటో బోల్తాపడిన తీరు చూస్తే ఘోరంగా వున్నా ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
read more కర్నూల్ రోడ్డు ప్రమాదం... మృతులకు రెండు, క్షతగాత్రులకు లక్ష రూపాయలు
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన కూలీలంతా రెంటచింతల మండలం మంచికళ్లు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.