
టీడీపీ నాయకులు అనైతిక రాజకీయాలకు పాలుపడుతున్నారని ధ్వజమెత్తారు వైసీపి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుగ్గన టీడీపీ నేతల పై విరుచుకుపడ్డారు. టీడీపీనే జై జగన్, జై వైఎస్ఆర్ అని ముద్రించి, స్లిపులను పంచి, ప్రజలను డబ్బుల కోసం తమ వద్దకు పంపుతోందని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో విద్యార్థులను పిలిచి నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ చేస్తున్న సర్వేలను అడ్డుకుంటే తమ నాయకుడి పై కిడ్నాపింగ్ కేసులు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు.
సర్వేల పేరుతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తుర్, బెంగళూర్‌ల నుండి విద్యార్థులను పిలిపించి, ఇంటింటికి తిరిగి ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు బుగ్గన. టీడీపీ కోసం ఓటు వెయ్యకపోతే ప్రజలకు వచ్చే పెన్షన్లు రావని బెదిరింపులకు దిగుతున్నారని ఆయన పెర్కొన్నారు. అంతేకాకుండా సర్వేలు వద్దని తమ నాయకుడు విద్యార్థులను పట్టుకుంటే కిడ్నాపింగ్ కేసును పెట్టారంటు ఆయన ప్రభుత్వాన్ని వాపోయారు. గతంలో ఎనాడు లేని విధంగా ప్రచారంలో వినూత్నమైనా పద్దతలుకు నాంది పలుకుతుందని మండి పడ్డారు. తెలుగు దేశం పార్టీ ఎన్నికల్లో ఏ స్థాయికైనా దిగజారే అవకాశం ఉందని తమ ఎంపీలు ముందుగానే ఈసీకి నెల రోజుల ముందే వినతి పత్రం అందించారని పెర్కొన్నారు రాజేంద్రనాథ్.
చంద్రబాబు దిగజారుడు తనం స్ఫష్టంగా కనిపిస్తొందన్నారు. ప్రజలు ఓట్లు వెయ్యకపోతే ప్రభుత్వం నిర్మించే రోడ్లపై తిరగరాదని, ప్రజలకు ఇచ్చే పెన్షన్ల తీసుకోరాదని ఏ ముఖ్యమంత్రి అయినా అంటారా అని బుగ్గన ప్రశ్నించారు. ప్రజలు కట్టే పన్నులతోనే ప్రభుత్వం అభివృద్ది పనులు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు చేసిన హామీలను ఒక్కటైనా చేశారా..అని ప్రశ్నించారు. దొంగ ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారు ఆయన ఆరోపించారు. ఓటమి భయంతోనే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుందని ఆయన ఎద్దేవా చేశారు.
బాలకృష్ట బహిరంగంగా డబ్బులు పంచుతున్నారంటేనే టీడీపీ తమ అధికారం అహాం చూపించమే అని బుగ్గన అన్నారు. కెమేరా ఉందని తెలిసి కూడా బాలయ్య కొడుతున్నారంటే దీని అర్థం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎంత అభిమాని అయినా కొడితే సంతోషంగా స్వీకరిస్తారా... మీరు అలాగే స్వీకరిస్తారా.. అని కర్నూల్ టీడీపీ అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి ని ప్రశ్నించారు. అదేవిధంగా ముద్రగడ ను బయట తిరగనివ్వరు కానీ కాపులతో ఆత్మీయ సమ్మేళనం ఎలా చేస్తారని ఆయన టీడీపీని ఈ సంధర్బంగా బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు.