
లోకేష్ ప్రచారం కోసం వైసీపి తహాతహా ఏంటని అనుకుంటున్నారా... చదివితే మీకే అర్థం అవుతుంది. నారా లోకేష్ ను ఎలగైనా సరే నంద్యాల్లో ప్రచారానికి రప్పించేందుకు వైసీపి ప్రయత్నస్తోందా.... వైసీపి నేతల డిమాండ్ చుస్తుంటే అవే అనుమానాలు మొదలయ్యాయి. శుక్రవారం వైసీపి అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ను నంద్యాల ప్రచారానికి చంద్రబాబును ఎందుకు పంపటం లేదని నిలదీశారు. నిజానికి నంద్యాల్లో లోకేష్ ప్రచారం చెయ్యడానికి చెయ్యడకపోవడానికి వైసీపికి ఏ మాత్రం సంబంధం లేదు, అయినా సరే లోకేష్ ప్రచారాన్ని బొత్స డిమాండ్ చెస్తున్నారంటే దాని వెనుక పెద్ద కథే ఉంది.
ఇంతకి ఆ కథేంటంటే.. నేల రోజుల క్రిత లోకేష్ నంద్యాల్లో రెండు రోజులు పర్యటించారు. తన రెండు రోజుల పర్యటనలో రుణమాఫి కోసం డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ బృతి కోసం నిరుద్యోగులు లోకేష్ తో బహిరంగంగానే గొడవకు దిగారు.
పై రెండు ఘటనలు అప్పట్లో టీడీపీ ప్రచారం పై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ఘటనలు చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లాయి. దాంతో ఎమనుకున్నారో ఎమోగాని లోకేష్ ను మళ్లీ ఇంత వరకు నంద్యాలకు పంపలేదు. మరో మూడు రోజుల్లో నంద్యాల ప్రచారం ముగుస్తుంది. ఇరు పార్టీల ప్రచారం పీక్ స్టేజీకి చేరుకుంది. ఈ దశలో మళ్లీ లోకేష్ గనుక ప్రచారానికి వస్తే స్థానికులతో లోకేష్‌కు గొడవ అవుతుందని, టీడీపీ కి ఓటర్లు దూరమవుతారని వైసీపి భావిస్తున్నట్లు ఉంది అందుకనే లోకేష్ ను నంద్యాలకు పంపమని రెచ్చగొడుతోంది.
అందులో భాగంగా నేడు బొత్స సత్యనారాయణ లోకేష్ ను ప్రచారానికి రమ్మని డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో "చంద్రబాబు పుత్రరత్నం ప్రచారం చేస్తే టీడీపీ పరువు మంటగలవడం ఖాయమని" ఛలోక్తులు విసిరారు వైసీపి అధికార ప్రతినిథి బొత్స సత్యనారాయణ. ఒక్క రోజు బయటకు వచ్చి ప్రచారం చేస్తే, లోకేష్ బండారం అంతా బయటపడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. మీడియాతో మాట్లాడిన బొత్స టీడీపీ పై ధ్వజమెత్తారు. తన కుమారుడు లోకేష్ మంచి నేత, ఘటికుడని చంద్రబాబు భావిస్తుంటే, ఎందుకు నంద్యాలలో ప్రచారానికి పంపడం లేదని ప్రశ్నించారు బొత్స. ఇప్పటికే చినబాబు నోటీ దురుసు అందరికి తెలిసిందే అని ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. ఇప్పటికే "బావమరిది బాలయ్యను పంపితే ఏదో చేస్తాడు అనుకుంటే ఇంకేదో చేసి వచ్చాడు, ఇక కొడుకును పంపితే అంతే సంగతులు" అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు సన్‌స్టోక్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజంగా లోకేష్ దమ్మున్న యువ నాయకుడే అయితే, ప్రచారానికి రాకుండా ఎందుకు దాక్కున్నారని బొత్స ప్రశ్నించారు.