నంద్యాలలో టిడిపి డబ్బు పంచుతోందో లేదో తెలీదట

Published : Aug 18, 2017, 01:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
నంద్యాలలో టిడిపి డబ్బు పంచుతోందో లేదో తెలీదట

సారాంశం

టిడిపి డబ్బులు పంచుతున్న విషయం మాత్రం తనకు తెలీదని అమాయకంగా చెప్పారు. ఓటర్లకు పార్టీలు ఎంత డబ్బులు పంచుతున్నాయన్న విషయం బయటకు చెప్పే మాట కాదన్నారు. ‘రాజకీయ పార్టీల్లోని నేతలు  అందరూ సత్య హరిశ్చంద్రులే’  అంటూ వ్యగ్యంగా అన్నారు. ‘వైసీపీ నేతలకు డబ్బు పంచక  తప్పదని అయితే తమ పార్టీ వాళ్లు డబ్బులు పంచుతున్నారో లేదో తనకు తెలీద’న్నారు.  

నంద్యాల ఉపఎన్నికలో వైసీపీకి డబ్బులు పంచక తప్పదని అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, టిడిపి డబ్బులు పంచుతున్న విషయం మాత్రం తనకు తెలీదని అమాయకంగా చెప్పారు. ఓటర్లకు పార్టీలు ఎంత డబ్బులు పంచుతున్నాయన్న విషయం బయటకు చెప్పే మాట కాదన్నారు. పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు జెసి విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా మాట్లాడుతూ ‘రాజకీయ పార్టీల్లోని నేతలు  అందరూ సత్య హరిశ్చంద్రులే’  అంటూ వ్యగ్యంగా అన్నారు.

ప్రజలకు అన్నీ గమనిస్తున్నారని, ఎవరిని ఆదరించాలో వారికి తెలుసన్నారు. డబ్బులు పంచుతూ పట్టుబడిన యువకుల గురించి ప్రస్తావిస్తూ ‘వేరే ఊరి నుంచి వచ్చారంటే మహా అయితే 10వేలు ఉంటాయి, లక్షలు దొరికాయంటే ఏమిటి అర్థం’ అంటూ ప్రశ్నించారు. ‘వైసీపీ నేతలు డబ్బు పంచుతున్నారు, వాళ్లకు తప్పదని అయితే తమ పార్టీ వాళ్లు డబ్బులు పంచుతున్నారో లేదో తనకు తెలీద’న్నారు.  తనకు డబ్బు లేదని పేపర్ లేదుని, టీవీ లేదంటూ జగన్ చెప్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతీ రోజూ పేపర్లో, టివిల్లో ఫోటోలు వేసుకుంటూ తనది కాదంటే ఎలా ? అంటూ ప్రశ్నించారు.

తనకు జగన్ పై సానుభూతి ఉందని, తాను చిన్నప్పటి నుంచి జగన్ ను చూస్తున్నట్లు చెప్పారు. మంచి రాజకీయ నాయకుడిగా జగన్ ను తీర్చిదిద్దాలని తనకూ ఉందని కానీ ఇన్ని అబద్దాలు చెబితే  ఎప్పుడు పైకొస్తాడో అని సందేహం వ్యక్తం చేసారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకునని జగన్ ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదన్నారు.

రాజకీయ నేతలకు ప్రజల్లో విశ్వసనీయత ఉండాలన్నారు. పనిలో పనిగా పోలవరం గురించి మాట్లాడుతూ, పోలవరం పూర్తి చేయాలనేది చంద్రబాబు ఆశ, కలన్నారు. అయితే, పరిస్థితులు దృష్ట్యా పోలవరం 2018కి పూర్తి కాదన్నారు.  మళ్లీ చంద్రబాబు వస్తే తప్ప పోలవరం పూర్తి కాదన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్