
chinna jeeyar swamy : సంక్షేమ పథకాల పేరు చెప్పి ప్రజలను ప్రభుత్వాలు బద్ధకస్తులుగా మారస్తున్నాయని చినజీయర్ స్వామి అన్నారు. ప్రభుత్వాలే ప్రజలను బలహీనులుగా మారుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని వీరవల్లికి వచ్చారు. ఈ సందర్భంగా విజయ డెయిరీ కొత్త యూనిట్ ప్రారంభోత్సవం చేశారు.
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు..
అనంతరం చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వివిధ రకాల సబ్సిడీలు ఇస్తున్నాయని అన్నారు. పుట్టిన సమయంలో ఒకటి, చనిపోతో మరొకటి, కూర్చుంటే ఇంకోటి, నడిస్తే, నిద్రపోతే, భోజనం చేస్తే, భోజనం చేయకపోతే ఇలా ప్రతీ దానికీ సబ్సిడీలు ఇస్తున్నాయని విమర్శించారు.
నన్ను ‘మోడీ జీ’ అని పిలవద్దు.. ‘మోడీ’ అంటే చాలు - బీజేపీ నేతలకు ప్రధాని విజ్ఞప్తి
ఇలా సబ్సిడీలు ఇవ్వడం వల్ల ప్రజలను బద్దకస్తులుగా ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయని చిన జీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు ప్రజలను బలహీనులుగా కూడా మారుస్తున్నాయని అన్నారు. ఇలా అన్నీ మన దగ్గరకే వస్తుంటే.. పని ఎందుకు చేయాలి అనే భావన ప్రజల్లో వస్తుందని ఆయన తెలిపారు.