ఆరోగ్యం బాగుంటే ఉంటా.. నా పోరు భావి తరాల కోసం: బాబు ఉద్వేగం

By Siva Kodati  |  First Published Feb 3, 2020, 8:40 PM IST

అమరావతిని రాజధానిగా మార్చొద్దని జగన్‌కు దండం పెట్టానని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుచేశారు. నేరచరిత్ర ఉన్న వ్యక్తికి దండం పెట్టకూడదని, అయినా ప్రజల కోసం దండం పెట్టానన్నారు. 


అమరావతిని రాజధానిగా మార్చొద్దని జగన్‌కు దండం పెట్టానని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుచేశారు. నేరచరిత్ర ఉన్న వ్యక్తికి దండం పెట్టకూడదని, అయినా ప్రజల కోసం దండం పెట్టానన్నారు. తన ఆరోగ్యం బాగుంటే ఉంటాను, తన పోరాటం తన కోసం కాదని భావితరాల కోసమని చంద్రబాబు తెలిపారు.

ఏపీ ప్రభుత్వానికి సంబంధించి పత్రికల్లో వస్తే యెల్లో జర్నలిజం, కులాలు అంటగడతారని కానీ జాతీయ మీడియాకు అలాంటివి లేవని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ప్రభుత్వం తీసుకున్న రాజధాని తరలింపుపై జాతీయ దినపత్రికల్లో వచ్చిన కథనాలను మీడియాకు చూపించారు.

Latest Videos

undefined

Also Read:జగన్ పై దూకుడు: పవన్ కల్యాణ్ చేతులు కట్టేసిన బిజెపి పొత్తు

మూడు రాజధానుల నిర్ణయం కారణంగా ఎమ్మెల్యేలకు, అధికారులకు వేతనాలు పెంచాల్సి రావొచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అధికార వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి జరగదని.. పరిశ్రమలు వస్తేనే డెవలప్‌మెంట్ ఉండదని టీడీపీ చీఫ్ తెలిపారు.

తిరుపతిలో యూనిట్ పెడతామని వచ్చిన రిలయన్స్ కంపెనీని జగన్ ప్రభుత్వాన్ని వెనక్కి పంపించిందని.. సింగపూర్ కంపెనీలను ప్రైవేట్ కంపెనీలని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నీతి, నిజాయితీకి నెంబర్‌వన్‌గా సింగపూర్‌ని కించపరుస్తున్నారంటే ఇతరులు పెట్టుబడులు వస్తారా... అని చంద్రబాబు ప్రశ్నించారు.

అనంతపురానికి కియా కంపెనీ తీసుకొస్తే అక్కడ రైతుల్ని వైసీపీ నేతలు రెచ్చగొట్టారని ప్రపంచ బ్యాంక్, ఏషియన్ బ్యాంకులు వెనక్కి పోయాయని ప్రతిపక్షనేత గుర్తుచేశారు. నంద్యాలను ప్రపంచ విత్తన రాజధానిగా చేసేందుకు ఒప్పందం చేసుకున్నామని, అలాంటి అవకాశాలు రాష్ట్రానికి రాకుండా చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Also Read:కల్లు తాగుతారు.. పొగరు మనిషి: జేసీపై శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలు

3 రాజధానులు పెట్టడానికి జగన్‌కు ఏం హక్కు ఉంది.. 3 రాజధానులు అని రాజ్యాంగంలో ఉందా..? అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. కర్నూలును రాజధానిగా చేస్తే సపోర్ట్ చేస్తామని చెప్పామని.. తమపై కావాలనే బురద జల్లుతున్నారని ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

కర్నూలులో అనేక ప్రాజెక్ట్‌లకు టెండర్లు పిలిచామని, ఆ ప్రాజెక్ట్‌లను ఎందుకు రద్దు చేశారని ప్రతిపక్షనేత నిలదీశారు. ఇరిగేషన్‌పై ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, కార్యాలయాలను విశాఖు తరలించొద్దని హైకోర్టు చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

ఎల్వీ సుబ్రమణ్యంను బాపట్లకు బదిలీ చేశారని.. సీఎస్ స్థాయి వ్యక్తిపై ఇలా వ్యవహరిస్తారా అన్నారు. జగన్ లాంటి దుర్మార్గులు వస్తారనే ఆలిండియా సర్వీసెస్ పెట్టారని, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్లు నియమించుకున్న వాళ్లు కాదని ప్రతిపక్షనేత తెలిపారు.

ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీ: పేర్లిచ్చిన టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్

జగన్‌ను నమ్ముకున్న చాలా మంది ఐఏఎస్‌లు జైలుకు వెళ్లారని, ఇవాళ్టీకి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. పీపీఏల విషయంలో అజేయ కల్లం, రమేశ్ కలిసి తప్పుడు పత్రాలు ఇచ్చారని.. అధికారులు చేసే తప్పుడు పనులకు పెన్షన్ కూడా రాదని ఆయన చురకలంటించారు.

రాజధాని తరలింపుపై హైకోర్టు చెప్పిన తర్వాత కూడా జీవోలు ఎందుకు జారీ చేశారని.. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అర్థరాత్రి కార్యాలయాలు ఎందుకు తరలిస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం రెచ్చిపోతున్నారని.. అందుకే పోలీసులు కూడా కేసులు పెట్టడం లేదని చంద్రబాబు ఆరోపించారు.

click me!