కల్లు తాగుతారు.. పొగరు మనిషి: జేసీపై శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 03, 2020, 07:49 PM IST
కల్లు తాగుతారు.. పొగరు మనిషి: జేసీపై శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలు

సారాంశం

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైరయ్యారు. ఆయన కల్లు తాగే, పొగరు వ్యక్తని రాయలసీమలో పుట్టి ఇక్కడి ప్రజలను అవమానరీతిలో మాట్లాడటం దారుణమని ఆయన మండిపడ్డారు

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైరయ్యారు. ఆయన కల్లు తాగే, పొగరు వ్యక్తని రాయలసీమలో పుట్టి ఇక్కడి ప్రజలను అవమానరీతిలో మాట్లాడటం దారుణమని ఆయన మండిపడ్డారు.

సీమలో ఇలాంటి వారు పుట్టడం దురదృష్టకరమని.. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో రాయలసీమకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణపై రాయలసీమ వాసిగా స్వాగతిస్తున్నానన్నారు.

Also Read:జగన్ పై దూకుడు: పవన్ కల్యాణ్ చేతులు కట్టేసిన బిజెపి పొత్తు

అమరావతి ప్రాంతాల రైతులే కావాలి.. మిగతా జిల్లాల రైతులు అవసరం లేదనే ధోరణిలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీక్షల పేరుతో కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకుతిన్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసుకోలేకపోతున్నామంటే అందుకు టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలే కారణమని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో హైకోర్టు బెంచ్ కావాలని రాయలసీమకు చెందిన లాయర్లు నాటి సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ అడిగితే ఇవ్వలేదని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు.

అభివృద్ధి వికేంద్రీకరణను రాయలసీమ నేతలు అడ్డుకోవడం సిగ్గు చేటని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రజలు టీడీపీ నేతలను ఖచ్చితంగా అడ్డుకుంటారని, ఫ్యాక్షనిస్టులు, కడప రౌడీలు అని చంద్రబాబు అంటుంటే.. టీడీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు.

Also Read:ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీ: పేర్లిచ్చిన టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్

70 ఏళ్ల నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని ఆయన గుర్తుచేశారు. వందల ఏళ్లుగా రాయలసీమ ప్రజలు అనేక విషయాల్లో త్యాగం చేశారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో రాయలసీమ ప్రాంత ప్రజలను రౌడీలు, గుండాలు అంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు కుటుంబ కార్యక్రమంలా చేశారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని 13 జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్