అర్చకుల వేతనాలకు రూ.120 కోట్లు: ఏపీ బడ్జెట్‌పై స్వరూపానందేంద్ర ప్రశంసలు

By Siva KodatiFirst Published May 20, 2021, 3:28 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ప్రశంసలు కురిపించారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌ కేటాయింపులపై ఆయన స్పందించారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ప్రశంసలు కురిపించారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌ కేటాయింపులపై ఆయన స్పందించారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత పాలకులు పట్టించుకోలేదని స్వరూపానంద పేర్కొన్నారు.

అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి జగన్‌ అభినందనీయులు అని స్వామీజి కొనియాడారు. జగన్‌కు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని తెలిపారు. కాగా, శాసనసభలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Also Read:ఏపీ బడ్జెట్‌: ఈబీసీతో పాటు పలు రంగాలకు అధిక కేటాయింపులు

2 లక్షల 29 వేల కోట్ల బడ్జెట్‌ తీసుకొచ్చారు. ఇందులో ఎప్పటిలాగే జగన్ సంక్షేమానికి పెద్ద పీట వేశారు. దీనితో పాటు బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.359 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ కేటాయింపులపై అర్చకులు, బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

click me!