కరోనా వ్యాక్సినేషన్ విషయంలో అన్నీ తెలిసి కూడ రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో అన్నీ తెలిసి కూడ రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సమయంలో ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. కోవిడ్ సమయంలో ఎవరిపైనో వేలేత్తి చూపితే సాధించేది ఏముందని ఆయన ప్రశ్నించారు.
also read:ప్రాణం విలువ తెలిసినందునే ఆరోగ్యశ్రీలో మార్పులు: వైఎస్ జగన్
వ్యాక్సినేషన్ ను పెంచితేనే హెల్త్ ఇమ్యూనిటీ కన్సిస్తోందన్నారు. వ్యాక్సినేషన్ వల్ల కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. దేవుడు ఆశీర్వదిస్తే అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితి ప్రకారంగా దేశంలో వ్యాక్సినేషన్ కు రూ. 172 కోట్ల డోసులు అవసరం ఉందన్నారు. దేశంలో నెలకు 7 కోట్ల డోసుల వ్యాక్సిన్ మాత్రమే తయారు చేసే కెపాసిటి ఉన్న విషయాన్ని ఆ యన గుర్తు చేశారు.
దేశంలో 18 కోట్ల 44 లక్షల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 11 శాతం వ్యాక్సినేషన్ కూడా దేశ వ్యాప్తంగా జరగని పరిస్థితి ఉందని చెప్పారు. ఏపీకి కావాల్సినవి 7 కోట్ల డోసులైతే కేంద్రం కేవంల 77 లక్షల లోపుగానే వ్యాక్సిన్ డోసులు ఇచ్చిందని ఆయన తెలిపారు. అన్నీ బాగా జరిగితే నా వల్లే జరిగాయని సక్రమంగా జరగకపోతే ఎదుటి వాళ్ల వల్ల జరిగిందని చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.