స్వర్ణ ప్యాలెస్ కేసు: పోలీసుల నోటీసులు.. డా.రమేశ్ బాబు స్పందన ఇది

By Siva KodatiFirst Published Sep 22, 2020, 10:09 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ స్వర్ణా ప్యాలెస్ కేసులో రమేశ్ హాస్పిటల్ అధినేత రమేశ్ బాబుకు మంగళవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ స్వర్ణా ప్యాలెస్ కేసులో రమేశ్ హాస్పిటల్ అధినేత రమేశ్ బాబుకు మంగళవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు.

విజయవాడ పీఎస్‌లో జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. అయితే కరోనా వైరస్, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాను ఆన్‌లైన్ ద్వారా విచారణకు హాజరవుతానని డాక్టర్ రమేశ్ బాబు తెలిపారు. 

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై పోలీసుల విచారణను ఆపేయాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఊర టలభించింది.

Also Read:స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం: జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై విచారణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. రమేష్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ రమేష్ బాబును నిర్బంధంలోకి తీసుకోకుండా విచారణ సాగించాలని ఆదేశించింది. డాక్టర్ రమేష్ బాబు కూడా విచారణకు సహకరించాలని సూచించింది.  

హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై దర్యాప్తును నిలిపేయాలని అనడం సరి కాదని అభిప్రాయపడింది. 

స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్వహించిన రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పి. రమేష్ బాబు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీతా రామ్మోహన్ రావులపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను అన్నింటినీ నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి డి. రమేష్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

click me!