ఓటరు నాడిపై సర్వే

Published : Oct 31, 2016, 03:17 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఓటరు నాడిపై  సర్వే

సారాంశం

ఓటర్ల నాడిి తెలుసుకునేందుకు సర్వే రాజకీయ పార్టీలు, సర్వేలు పోటీ

మున్పిపల్ ఎన్నికల వేడి మొదలైంది. జరుగుతుందో లేదో తెలీదు గానీ ఇప్పటి నుండే ఓటరు నాడి పట్టుకోవటానికి పార్టీలు పోటీ పడుతున్నాయి. న్యాయస్ధానానికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నవంబర్ మాసంలో  రాష్ట్రంలోని 11 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాలి. ఇందులో భాగంగానే ఆయా పురపాలక సంఘాల్లో ఓటర్ల నమోదు, జాబితాల సవరణ తదితరాలను ప్రభుత్వం వేగంగా చేయిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను అధికార తెలుగుదేశం తొలగిస్తున్నట్లు వైసీపీతో పాటు ఇతర పక్షాలు ఆరోపణలు మొదలయ్యాయనుకోండి అది వేరే సంగతి.

ఒటర్ల నమోదు, జాబితాల సవరణ ఎలాగున్నా, అసలు ఓటరు మనోగతం తెలుసుకునే ప్రక్రియ అయితే ఊపందుకున్నది. ఇందులో భాగంగానే టెలిఫోన్ సర్వే మొదలైంది. రాజకీయ పార్టీల తరపున తాజాగా ఆంధ్రప్రదేశ్ లో టెలిఫోన్ సర్వే మొదలైంది. ఏ పార్టీ చేయిస్తోందో ? లేక ఏ పార్టీ తరపున ఏ సంస్ధ చేస్తోందో స్పష్టత లేదుగానీ మొత్తానికి గడచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టెలిఫోన్ సర్వే మాత్రం మొదలైంది.

  ఏపిలో వేలాది మంది ఓటర్లకు ప్రతీ రోజు హైదరాబాద్ లోని 040 38399889 నెంబర్ నుండి ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డు సిస్టమ్ (ఐవిఆర్ఎస్) ద్వారా ఫోన్ వస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయదలుచుకున్నారన్న ప్రశ్నతో సర్వే మొదలౌతోంది. నేరుగా పార్టీ అధినేతల పేర్లతోనే సర్వే జరుతుండలం గమనార్హం.

చద్రబాబునాయడుకు అయితే 1 నొక్కండని, జగన్మోహన్ రెడ్డి అయితే 2 నొక్కండని, హరిబాబుకైతే 3 నొక్కండని వాయిస్ వినిపిస్తోంది.

  అదే విధంగా, కాంగ్రెస్, వామపక్షాలకు ఓట్లు వేయదలుచుకుంటే ఫలానా నెంబర్ నొక్కండని కూడా వాయిస్ లో వినిపిస్తోంది. దాంతో పాటు టిడిపి, భాజపాలు కలిసి పోటీ చేస్తే, మిత్రపక్షాలకు ఓట్లు వేస్తారా ? లేక వైసీపీకి ఓటు వేస్తారా అంటూ ఓటర్ల అభిప్రాయాలు కూడా సర్వేలో తెలుసుకుంటున్నారు.

 ఈ సర్వే ద్వారా ఒక విషయం స్పష్టమవుతున్నట్లు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పురపాలక సంఘాల ఎన్నికలు అంటూ జరిగితే, ఓటర్ల అభిప్రాయాల మేరకు భాజపాతో పొత్తు విషయాన్ని టిడిపి తేల్చకుంటుందా అన్న అనుమానాలు ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి. అసలు సర్వే ఈ ఆధారంగానే ఎన్నికల నిర్వహణ కూడా ఆధారపడి ఉంటుందేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారులేండి.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: చంద్రబాబు పంచ్ లకి పడి పడి నవ్విన నారా భువనేశ్వరి| Asianet News Telugu
Vangalapudi Anitha Strong Warning to Jagan: గుర్తుపెట్టుకో జగన్ ఎవ్వరినీ వదిలిపెట్టం |Asianet Telugu