చంద్రబాబుకు శంకుస్థాపనల పిచ్చి పట్టింది

First Published Oct 29, 2016, 10:48 AM IST
Highlights
  • అమరావతికి ఎన్నిసార్లు శంకు స్థాపన చేస్తారు : కాంగ్రెస్ ప్రశ్న
  • ప్రధాని ఆంధ్రుల నోట్లో మట్టి కొడితే, జైట్లీ ఖాళీ పాకేజీ  విసిరేశాడు
  •  ప్రత్యేక హోదా మహాపోరుకు సమయమొచ్చింది

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రా ప్రజల నోట్టో మట్టి గొడితే, ఆర్ధిక  మంత్రి అరుణ్ జైట్లీ పనికిమాలిన ప్యాకేజీ ముఖాన కొడుతున్నడాని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి విమర్శించారు.

 

శుక్రవారం నాడు జైట్లీ అమరావతిలో ప్రభుత్వం భవనాలకంటూ చేసిన శంకుస్థాపన మీద వ్యాఖ్యానిస్తూ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడికి  శంకుస్థాపనల పిచ్చి పట్టుకుందని,వాటికి కేంద్రం వత్తాసు పలుకుతూ ఉందని చెప్పారు.కేంద్రమూ,  రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి తెలుగు ప్రజలను దగా చేస్తున్నాయని  పిసిసి అధ్యక్షుడు ఆరోపించారు.

 

‘ పిచ్చి కాకుంటే మరేమిటి? ఏపీ కొత్త రాజధాని అమరావతికి ఇంకా ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు. ఇలా ఎవరిని మోసం చేస్తారు,’అని ప్రశ్నించారు.అరుణ్ జైట్టీ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్యాకేజీ గురించి మాట్లడుతూ  రాష్ట్రినికి రూ 2 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తున్నామని  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పదే పదే  ప్రకటించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు.
 

’14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అన్ని రాష్ట్రాలకు నిధులు వచ్చినట్టుగానే ఏపీకి కూడా నిధులు కేటాయిస్తున్నారు.  అంతేతప్ప ప్రత్యేక ప్యాకేజీ అని చెపుతున్న దానిలో  కొత్త గా  ఇస్తున్నదేముందో జైట్లీ, చంద్రబాబు ప్రకటించాలి,’ రఘవీరా డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీ మొత్తం  బోగస్‌ అని మండిపడ్డారు.

 

’విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా కేంద్రం అమలు చేయడం లేదని చెబుతూ అసలు చట్టాన్ని అమలుచేయకుండా ప్రత్యేక ప్యాకేజీ అనడంలోనే ద్రోహం ఉందని, చంద్రబాబునాయుడు, కేంద్రం రెండూ కలసి అడుతున్న నాటకమిదంతా అని ఆయన చెప్పారు.

 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటిపంచేయడం చాలా అన్యాయమని వ్యాఖ్యానిస్తూ,  ప్యాకేజీలో నిధులు సొంతలాభాలకు వాడు కోవచ్చనే  దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ పాట పాడుతున్నారని విమర్శించారు.ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తామనడం మోసానికి పరాకాష్ట అని అన్నారు.

 

ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ  ప్రత్యేక హోదా కోసం పోరాడిందని, ఇపుడు సమైక్యపోరాటానికి సిద్ధమవుతూ ఉందని అంటూప్రజలు  ఈ పోరాటానికి సమాయత్తం కావాలని కోరారు.

 

click me!