జీవో నెంబర్ 1:విచారణ ఈ నెల 23కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

By narsimha lode  |  First Published Jan 20, 2023, 12:21 PM IST


జీవో నెంబర్  1పై  ఏపీ ప్రభుత్వం  దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.
 


అమరావతి: జీవో నెంబర్  1పై  ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ  ఏపీ ప్రభుత్వం  దాఖలు చేసిన స్పెషల్  లీవ్ పిటిషన్ పై  విచారణను  ఈ నెల  23వ తేదీకి  విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.   
ఈ నెల  23వ తేదీన ఈ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ ఉంది. దీంతో  ఈ కేసు విచారణ తర్వాత సుప్రీంకోర్టు  విచారణ చేసే అవకాశం ఉంది.  అయితే ఈ కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్  విచారణ జరిపించాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది.  జీవో నెంబర్ 1పై  ఇచ్చిన స్టేను  ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.  ఈ తరుణంలో తాము జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.  

జీవో నెంబర్  1ని నిరసిస్తూ  సీపీఐ ఏపీ రాష్ట్రసమితి కార్యదర్శి రామకృష్ణ ఈ నెల  12న  ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.   రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన  జీవోనెంబర్ 1 పోలీస్ యాక్ట్  30కి అనుగుణంగా లేదని  హైకోర్టు అభిప్రాయడింది. ఈ నెల  23వ తేదీ వరకు  ఈ జీవోను సస్పెండ్  చేస్తూ  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఈ ఆదేశాలను  సవాల్ చేస్తూ  ఏపీ హైకోర్టు  సుప్రీంకోర్టులో ఈనెల  17వ తేదీన  స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై  విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు  ఈ నెల  23వ తేదీకి వాయిదా వేసింది.

Latest Videos

undefined

2022 డిసెంబర్  28వ తేదీన ప్రకాశం జిల్లా కందుకూరు, ఈ నెల  1వ తేదీన  గుంటూరులో  చంద్రబాబు పాల్గొన్న సభల్లో తొక్కిసలాటలు జరిగాయి. ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన సభల్లో  ఎనిమిది మంది,  గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో  ముగ్గురు మృతి చెందారు. రోడ్లపై  రోడ్ షోలు, ర్యాలీలు, సభలు నిర్వహించడంపై నిషేధాన్ని  విధిస్తూ  ఈనెల  2వ తేదీన జీవో నెంబర్ 1ని  జగన్ సర్కార్ తీసుకు వచ్చింది.ఈ జీవో నెంబర్  1పై  విపక్షాలు జగన్ సర్కార్ పై విమర్శలు  చేశాయి. విపక్షాలను లక్ష్యంగా  చేసుకుిని ఈ జీవోను తీసుకు వచ్చాయని  విమర్శలు వచ్చాయి.  ఈ విషయమై  విపక్షాలు చేసిన విమర్శలను వైసీపీ తప్పుబట్టింది.  ఈ జీవోను తాము కూడా పాటించాల్సిందేనని  అధికార పార్టీ నేతలు  ప్రకటించారు.

also read:జీవో నెం.1పై హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్

జీవో నెంబర్  1ని ఆధారంగా  చేసుకొని ఇటీవల కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును చంద్రబాబు తప్పుబట్టిన విషయం తెలిసిందే.   రాష్ట్ర వ్యాప్తంగా  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు  సిద్దమయ్యారు.  ఈ నెల  27 నుండి లోకేష్  పాదయాత్ర చేయనున్నారు.  పాదయాత్రకు సంబంధించి  లోకేష్ చిత్తూరు జిల్లా పోలీసులను అనుమతి కోరారు.


 


 

click me!