ఈయన కూడా నీతులు చెబుతున్నారు

First Published Jun 12, 2017, 3:19 PM IST
Highlights

సుజనా కూడా బ్యాంకు రుణాలు ఎగొట్టిన వారి నుండి రుణాలు ఎలా వసూలు చేయాలనే విషయమై సలహాలు ఇచ్చారు. ఎంతైనా అనుభవజ్ఞుడు కదా? పైగా చాలా బ్యాంకుల్లో డిఫాల్టర్లు పెరిగిపోతున్నారని ఆందోళన ఒకటి.

చివరకు సుజనా చౌదరి కూడా నీతులు చెబుతున్నారు. అదికూడా బ్యాంకు రుణాలు ఎగొట్టిన వారి గురించి. కేంద్రమంత్రిగా ఉన్న సుజనాచౌదరే వందల కోట్ల బ్యాంకు రుణాలను ఎగొట్టారు. మారిషస్ కమర్షియల్ బ్యాంకు (ఎంసిబి)నుండి సుమారు రూ. 110 కోట్లు రుణం తీసుకున్న చౌదరి రుణం ఎగొట్టారు. రుణం ఎగవేతపై బ్యాంకు కేంద్రమంత్రిపై కోర్టులో కేసు కూడా వేసింది. కేసును విచారించిన కోర్టు కేంద్రమంత్రికి నాన్ బెయిల బుల్ అరెస్టు వారెంటు కూడా జారిచేసింది. అయితే, దానిపై మంత్రి స్టే తెచ్చుకుని బయట తిరుగుతున్నారు.

అది ఘనత వహించిన సుజనా నేపధ్యం. అటువంటి సుజనా కూడా బ్యాంకు రుణాలు ఎగొట్టిన వారి నుండి రుణాలు ఎలా వసూలు చేయాలనే విషయమై సలహాలు ఇచ్చారు. ఎంతైనా అనుభవజ్ఞుడు కదా? పైగా చాలా బ్యాంకుల్లో డిఫాల్టర్లు పెరిగిపోతున్నారని ఆందోళన ఒకటి. రుణాలు తీసుకున్న వారు సుజనా చౌదరిని తమ రోల్ మోడల్ గా తీసుకున్నారేమో. అందుకే డిఫాల్టర్లు  పెరిగిపోతున్నారు.

బ్యాంకు రుణాలను ఎలా వసూలు చేయాలో కొన్ని చిట్కాలు కూడా చెప్పారట లేండి. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రభుత్వంతో వ్యాపారం చేయలేదట. గజం ప్రభుత్వ స్ధలం కూడా తీసుకోలేదట. డబ్బు సంపాదించటం జన్మహక్కన్నారు. అయితే నీతిగా సంపాదించాలట. ఎలాగుంది సూజనా విసిరిన పంచ్...  

click me!