నిధి వేటతో లింక్ ఉన్న హత్య కేసును ఛేదించిన శ్రీకాళహస్తి పోలీసులు.. నిందితుడి అత్యాశే దొరికిపోయేలా చేసింది..

By Asianet NewsFirst Published May 26, 2023, 12:24 PM IST
Highlights

గతేడాది జరిగిన రిటైర్డ్ లైన్ మెన్ వెంకటేశ్వర్లు హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతడి హత్య గుప్త నిధుల వేటతో ముడిపడి ఉంది. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి-పిచ్చాటూరు రహదారిలో కొత్త కండ్రిగ క్రాస్‌ సమీపంలో నిధుల వేటతో సంబంధం ఉన్న రిటైర్డ్‌ లైన్‌మెన్‌ హత్య కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ హత్య ఏడాది కిందట జరగ్గా.. తాజాగా ఈ కేసును శ్రీకాళహస్తి పోలీసులు ఛేదించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో వరదయ్యపాలెం మండలానికి చెందిన పి.విజయ కుమార్ (35), అతడి అనుచరులు టి.చిన్న పుట్టయ్య (35), పి.మహేష్ (25), కె.లోకేష్ (21), పి.దుర్గాప్రసాద్ (21), టి.చల్లయ్య (23)లు ఉన్నారు.

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవ వేడుక.. రూ.75 స్మారక నాణెం విడుదల చేయనున్న కేంద్రం

ఈ కేసు వివరాలను శ్రీకాళహస్తి డీఎస్పీ భీమారావు వెల్లడించారు. రిటైర్డ్ ఎలక్ట్రికల్ లైన్ మెన్ అయిన తన సోదరుడు వెంకటేశ్వర్లు (63) 2022 జూలై 26 నుంచి కనిపించడం లేదని వరదయ్యపాలెం పోలీసులకు బి.ఆంజనేయులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు.

డీఎస్పీ భీమారావు ‘డెక్కన్ క్రానికల్’కు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో నిందితుడైన విజయ కుమార్ అనే వ్యక్తి తల్లితో వెంకటేశ్వర్లుకు వివాహేతర సంబంధం ఉండేది. అయితే ఆమె గతేడాది కరోనాతో మరణించింది. అయితే వెంకటేశ్వర్లుకు పెళ్లికాలేదు. వారసులు కూడా ఎవరూ లేకపోవడంతో ఆయన్ను హత్య చేసి, ఆస్తులు లాక్కోవాలని విజయ కుమార్ ప్లాన్ వేశాడు. అయితే వెంకటేశ్వర్లుకు గుప్తనిధుల పట్ల ఒక బలహీనత ఉండేది. దీనినే ఆయన ఆసరాగా చేసుకున్నాడు.

13 ఏళ్ల అక్క ప్రియుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన చెల్లి.. తల్లిదండ్రులకు ఎక్కడ చెబుతుందో అని ఏం చేసిందంటే 

గుప్త నిధులు తవ్వుదామని విజయ కుమార్ వెంకటేశ్వర్లు ప్రలోభపెట్టాడు. గత ఏడాది జూలై 26న అర్ధరాత్రి సమయంలో వెంకటేశ్వర్లును తొట్టంబేడు మండలం బోనుపల్లి అడవుల్లోని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం అడవిలోకి వెళ్లాక విజయ్, అతడి స్నేహితులు కలిసి ఆయనను హత్య చేశారు. మృతదేహాన్ని నరికి వేర్వేరు ప్రాంతాల్లో పూడ్చిపెట్టారు.

ప్రేమ పేరుతో కూతురు వెంటపడుతున్నాడని బాలుడి హతమార్చిన తండ్రి.. ఎక్కడంటే ?

తరువాత నిందితులు అప్పుడప్పుడు అడవికి వెళ్లి కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకుని వాటిని తెలుగుగంగ కాలువలో పారేసేవారు. దీంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ విజయ కుమార్ అత్యాశే చివరికి అతడిని పట్టించింది. హత్యకు గురైన వెంకటేశ్వర్లు పింఛను నిధిని అతడు తన సొంత ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసును నిశితంగా పరిశీలిస్తూ, సాక్ష్యాధారాలను శాస్త్రీయంగా దర్యాప్తు చేయడంతో ఈ హత్య ఉదంతం బయపడింది. 

click me!