కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రి నుండి వైఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్: హైద్రాబాద్ కు తరలింపు

కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రి నుండి  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి  వైఎస్ శ్రీలక్ష్మి  డిశ్చార్జ్ అయ్యారు


కర్నూల్: కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రి నుండి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి  వైఎస్ శ్రీలక్ష్మి  శుక్రవారంనాడు డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను  హైద్రాబాద్ కు తరలిస్తున్నారు. ఈ నెల  19వతేదీ నుండి  కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రిలో  వైఎస్శ్రీక్ష్మి  చికిత్స  పొందుతున్నారు. 

పులివెందులలోని తన నివాసంలో  వైఎస్ శ్రీలక్ష్మి  ఈ నెల  19న అస్వస్థతకు గురయ్యారు.  దీంతో ఆమెను  పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో  చేర్పించారు. దినేష్ ఆసుపత్రిలో  ప్రాథమిక  చికిత్స  నిర్వహించార.  ఈ చికిత్స  తర్వాత ఆమెను  కర్నూల్ లోని విశ్వభారతి  ఆసుపత్రికి తరలించారు.ఈ నెల  19వ తేదీ నుండి విశ్వభారతి  ఆసుపత్రిలో  వైఎస్ శ్రీలక్ష్మికి చికిత్స అందించారు.  ఆమె ఆరోగ్యం  మెరుగుపడింది.  ఈ విషయాన్ని విశ్వభారతి  ఆసుపత్రి వైద్యులు  హెల్త్ బులెటిన్ లో   ప్రకటించారు. ఈ మేరకు  శుక్రవారం నాడు  హెల్త్ బులెటిన్  ను విడుదల చేశారు  విశ్వభారతి  ఆసుపత్రి వైద్యులు.

Latest Videos

అయితే  ఇంకా వైఎస్ శ్రీలక్ష్మికి గుండెకు  సంబంధించి  హైద్రాబాద్ ఆసుపత్రిలో  చికిత్స  అందించాలని విశ్వభారతి  ఆసుపత్రి వైద్యులు  సూచించారు. దీంతో  కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రి నుండి  హైద్రాబాద్ లో మెరుగైన వైద్యం కసం  వైఎస్ శ్రీలక్ష్మిని తరలించారు. తల్లికి  అనారోగ్యంగా  ఉన్న కారణంగా  సీబీఐ విచారణకు  కూడా  వైఎస్ అవినాష్ రెడ్డి  హాజరు కాలేదు.   ఇదే విషయాన్ని సీబీఐ అధికారులకు  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమాచారం  ఇచ్చారు.   మరోవైపు ముందస్తు బెయిల్ కోసం  కోర్టును  ఆశ్రయించారు వైఎస్ అవినాష్ రెడ్డి.   ఈ పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు  వెకేషన్ బెంచ్  ఇవాళ  విచారణ  జరపనుంది.  సుప్రీంకోర్టు  ఆదేశాల మేరకు  తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్   విచారణ  నిర్వహించనుంది. 

also read:మెరుగైన వైద్యం కోసం వైఎస్ శ్రీలక్ష్మిని హైద్రాబాద్‌కు తరలిస్తున్నాం: వైఎస్ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు విషయమై  ఈ నెల  16, 19, 22  తేదీల్లో  విచారణకు  రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు  జారీ  చేసింది.  అయితే   పలు కారణాలు చూపుతూ   సీబీఐ  విచారణకు  వైఎస్  అవినాస్ రెడ్డి  గైర్హాజరయ్యారు.

click me!