శ్రీ సిటీలో బాయిలర్ పేలుడుతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. ట్యాబ్లెట్ ఇండియా క్లారిటీ

Published : Oct 04, 2026, 10:50 PM IST
Sri City Blast

సారాంశం

Sri City Blast: శ్రీ సిటీలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనపై ట్యాబ్లెట్ ఇండియా లిమిటెడ్ స్పందించింది. ఏపీలోని శ్రీ సిటీలో తమకు ఎలాంటి ఫ్యాక్టరీ లేదా తయారీ కేంద్రం లేదని, ఈ ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

ట్యాబ్లెట్ ఇండియా కీలక ప్రకటన

శ్రీ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో శనివారం నీటి బాయిలర్ పేలడంతో కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తమ సంస్థ పేరు వినిపించడంతో Tablets (India) Limited వివరణ ఇచ్చింది. శ్రీ సిటీలో తమకు ఎలాంటి తయారీ యూనిట్ లేదని పేర్కొంది. అలాగే ప్రమాదం జరిగిన సంస్థకు, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఏర్పడిన గందరగోళాన్ని తొలగించేందుకే ఈ ప్రకటన చేసినట్లు సంస్థ తెలిపింది.

రెండు సంస్థలు వేర్వేరు

ట్యాబ్లెట్ ఇండియా లిమిటెడ్‌, టీఐఎల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవి రెండూ వేర్వేరు, స్వతంత్ర సంస్థలని ట్యాబ్లెట్ ఇండియా తెలిపింది. ఈ రెండు సంస్థలకు ఉమ్మడి యాజమాన్యం లేదా ఒకే మేనేజ్‌మెంట్ లేదని స్ప‌ష్టం చేసింది. శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంతో తమ సంస్థకు సంబంధం ఉందనే అపోహలు రావడంతో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు పేర్కొంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు సంస్థ సానుభూతి తెలిపింది.

బాయిలర్ పేలుడులో ఐదుగురు మృతి

శనివారం శ్రీ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో నీటి బాయిలర్ పేలడంతో తీవ్ర ప్రమాదం జరిగిన విష‌యం విదిత‌మే. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. మృతుల వివరాలు కూడా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు భరోసా

ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu
బుర్రిపాలెంని ఉర్రుతలూగించిన బాబు ఉరమాస్ స్పీచ్ | Chandrababu Buripalem Speech | Asianet Telugu