పంచ్ ప్రభాకర్‌పై తీసుకొన్న చర్యలేమిటీ? అఫిడవిట్ దాఖలుకు సీబీఐకి ఏపీ హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Oct 29, 2021, 3:00 PM IST
Highlights

కోర్టులు, జడ్జిలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసు విషయంలో సీబీఐ ఎస్పీపై ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచ్ ప్రభాకర్ పై తీసుకొన్న చర్యల గురించి ఎస్పీని ప్రశ్నించింది.ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

అమరావతి:  Judges, Courtలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులోCbiపై AP High court శుక్రవారం నాడు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ ఇవాళ హైకోర్టుకు హాజరయ్యారు. జడ్జిలు, కోర్టులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసుకు సంబంధించి తీసుకొన్న చర్యలపై ఏపీ హైకోర్టు సీబీఐ ఎస్పీని ప్రశ్నించింది. అయితే Punch Prabhakar వీడియోలపై Youtube కు లేఖ రాసినట్టుగా సీబీఐ ఎస్పీ హైకోర్టుకు తెలిపారు. అయితే తమకు సీబీఐ నుండి ఎలాంటి లేఖలు రాలేదని యూట్యూబ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.ఇదిలా ఉంటే పంచ్ ప్రభాకర్ ను ఎవరో నడిపిస్తున్నారని హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ అనుమానం వ్యక్తం చేసింది.పంచ్ ప్రభాకర్ పై తీసుకొన్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని  సీబీఐని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చిన సమయంలో social Mediaలో కోర్టులు, జడ్జిలకు వ్యతిరేకంగా  కొందరు పోస్టులు పెట్టారు.ఈ  విషయమై హైకోర్టులో  పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు ఏపీ సీఐడీకి విచారణ బాధ్యతను అప్పగించింది. సీఐడీ విచారణ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం చివరికి ఈ కేసు విచారణను 2020 అక్టోబర్ 8వ తేదీన సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకొంది.

ఏపీలో కోర్టులిచ్చిన తీర్పులపై అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు గతంలో చేసిన వ్యాఖ్యల గురించి హైకోర్టు సుధీర్ఘంగా విచారణ చేసిన తర్వాత విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ వ్యాఖ్యలతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు కూడ పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి.ఈ విషయమై సీఐడీ  విచారణ విషయంలో హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీఐడీ స్థానంలో విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకొంది. అయితే సీబీఐ విచారణ తీరుపై కూడా  ఇవాళ ఏపీ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.

also read:జడ్జిలపై అభ్యంతరకర వ్యాఖ్యలు: సీబీఐ విచారణ తీరుపై ఏపీ హైకోర్టు అసంతృప్తి

ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ ఏడాది జూలై, ఆగష్టు మాసాల్లో ఆదర్ష్ రెడ్డి, కొండారెడ్డి, సాంబశివరెడ్డి, సుధీర్ లను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిపై ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఇదే కేసులో ఈ నెల 22న  అవుతు శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గుడా శ్రీధర్ రెడ్డి,  శ్రీనాథ్, కిషోర్, అజయ్, అమృత్‌ లను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో స్టేటస్ రిపోర్టును ఈ నెల 6వ తేదీన హైకోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు.

నిందితులు కొందరు విదేశాల నుండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సీబీఐ గుర్తించింది. అయితే విదేశాల్లో ఉన్న వారిని ఇండియాకు రప్పించే విషయమై కూడ సీబీఐ అధికారులు  పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది నిందితులున్నారనే విషయమై కూడ ఉన్నత న్యాయస్థానం ప్రశ్నిస్తోంది. విదేశాల్లో ఉన్న నిందితులను రప్పించడానికి ఆయా దేశాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దిశగా సీబీఐ అధికారులు చర్యలు తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.
 

click me!