నిన్న నాగార్జున.. నేడు దిల్‌రాజు: ఏపీకి క్యూకట్టిన సినీ పెద్దలు, ఏం జరుగుతోంది..?

By Siva KodatiFirst Published Oct 29, 2021, 1:56 PM IST
Highlights

మంత్రి పేర్ని నానితో (perni nani) సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. మంత్రి పేర్ని నానిని కలిసిన వారిలో నిర్మాతలు దిల్‌ రాజు (dilraju) , అలంకార్‌ ప్రసాద్‌ (alankar prasad) తదితరులు వున్నారు. ఈ సందర్భంగా సినీ రంగానికి సంబంధించిన పలు సమస్యలు, సినిమాటోగ్రఫీ చట్టం సవరణ, ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు పేర్కొంటున్నారు.

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి సినిమాటోగ్రఫీ (cinematography) చట్ట సవరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి (ap cabinet) గురువారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సచివాలయంలో మంత్రి పేర్ని నానితో (perni nani) సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. మంత్రి పేర్ని నానిని కలిసిన వారిలో నిర్మాతలు దిల్‌ రాజు (dilraju) , అలంకార్‌ ప్రసాద్‌ (alankar prasad) తదితరులు వున్నారు. ఈ సందర్భంగా సినీ రంగానికి సంబంధించిన పలు సమస్యలు, సినిమాటోగ్రఫీ చట్టం సవరణ, ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు పేర్కొంటున్నారు.

కాగా.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ (tollywood) నిర్మాతలు పలు అనుమానాలను వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అగ్ర కథానాయకుడు నాగర్జున (nagarjuna) .. గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో (ys jagan mohan reddy) భేటీ అయి మాట్లాడారు. ఆయన సీఎం జగన్‌ను కలిసిన అనంతరం .. తాజాగా సినీ నిర్మాతలు మంత్రి పేర్ని నానితో భేటీ కావడం టాలీవుడ్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ నుంచి కొంత సమాచారం అడిగిందని.. అది ఇవ్వడానికే మంత్రిని కలిసినట్లు వెల్లడించారు. 

Also Read:జగన్‌ని చూసి చాలా రోజులైంది.. అందుకే వచ్చా : హీరో నాగార్జున .. చర్చలపై సస్పెన్స్

రానున్న రోజుల్లో మరింతగా సినిమాల విడుదలలు ఊపందుకుంటున్నాయి. అందులో భాగంగా చిన్నా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ప్రధానంగా అగ్ర హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సినిమా ప్రదర్శనల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నిర్మాతలకు నష్టం కలిగించేదిగా ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. టికెట్ల రూపంలో వచ్చిన డబ్బును నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఇవ్వకపోతే వారు నష్టపోయే ప్రమాదం ఉందని సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌తో నాగార్జున భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, టికెట్‌ రేట్లు, బెనిఫిట్‌ షోలు తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నాగార్జున నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నాగ్‌ మీడియాతో మాట్లాడుతూ, `జగన్‌ నా శ్రేయోభిలాషి. ఆయనను చూసి చాలా రోజులవుతోంది. అందుకే విజయవాడకు వచ్చా. సీఎం జగన్‌తో కలిసి లంచ్‌ చేశా. విజయవాడ రావడం నాకు ఆనందంగా ఉంది` అని తెలిపారు. అయితే తమ మధ్య జరిగిన చర్చల విషయాలను ఆయన వెల్లడించకపోవడం గమనార్హం. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డిలు ఉన్నారు.

click me!