Kommareddy Pattabhi: పట్టాభి అరెస్ట్ కేసు.. ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు, కారణమిదే..?

Siva Kodati |  
Published : Oct 29, 2021, 10:06 AM IST
Kommareddy Pattabhi: పట్టాభి అరెస్ట్ కేసు.. ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు, కారణమిదే..?

సారాంశం

పట్టాభిని అరెస్ట్ చేసిన కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. ఆయనను అరెస్ట్ చేసే సమయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించలేదన్న ఆరోపణలపై వీరిద్దరిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. బదిలీ వేటుకు గురైన వారిలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో (vijayawada police commissionerate) విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రమేశ్, సీఐ నాగరాజు ఉన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (ys jagan) అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అయితే ప్రస్తుతం బెయిల్‌పై ఆయన బయటకు వచ్చారు. మరోవైపు పట్టాభిని అరెస్ట్ చేసిన కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. ఆయనను అరెస్ట్ చేసే సమయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించలేదన్న ఆరోపణలపై వీరిద్దరిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. బదిలీ వేటుకు గురైన వారిలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో (vijayawada police commissionerate) విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రమేశ్, సీఐ నాగరాజు ఉన్నారు.

పట్టాభిని అరెస్ట్ చేసే సమయంలో ఖాళీలతో నోటీసులు ఇచ్చినందుకు మేజిస్ట్రేట్ వీరిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఏసీపీ రమేశ్‌ను (acp ramesh) డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అలాగే సీఐ నాగరాజును ఏలూరు రేంజి డీఐజీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జైలు నుంచి Bailపై విడుదలైన TDP అధికార ప్రతినిధి Pattabhiramను గవర్నర్‌పేట పోలీసులు కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, వారి ప్రయత్నం బెడిసికొట్టింది. పట్టాభిని తమ Custodyకి ఇవ్వాలని వీరు కోర్టులో Petition వేశారు. అయితే, ఆ పిటిషన్‌ను గురువారం విజయవాడ కోర్ట్ కొట్టేసింది.

పట్టాభిని కస్టడీకి అనుమతించాలని కోరుతూ విజయవాడ న్యాయస్థానంలో గవర్నర్‌పేట పోలీసులు ఓ పిటిషన్ వేశారు. పట్టాభి చేసిన వ్యాఖ్యల్లో కుట్ర కోణం దాగి ఉన్నదని పోలీసులు వాదించారు. ఆ కుట్రకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టడానికి పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై ఇరువైపులా వాదనలు జరిగాయి. పట్టాభి అరెస్టు ప్రక్రియ సరిగా లేదని, ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానమే పేర్కొన్నదని పట్టాభి తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

Also Read;పట్టాభిని కస్టడీకి ఇవ్వాలనే పోలీసుల పిటిషన్ కొట్టివేత

కాగా, ఏపీ రాజకీయాల్లో పట్టాభిరామ్ కేంద్రంగా మారారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆయన బూతు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. పట్టాభిరామ్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశాయి. పట్టాభి నివాసంపైనా దాడులు జరిపాయి. ఏపీ పోలీసులు పట్టాభిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నవంబర్ 2న ఆయనను జ్యూడిషియల్ రిమాండ్ తరలించడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు (rajahmundry central jail) పంపారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని పట్టాభిని కోర్టును ఆశ్రయించారు. ఈ దరఖాస్తుపై వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్‌పై బయటకు వచ్చిన పట్టాభి నేరుగా విజయవాడ రాలేదు. దీనిపై కొంతకాలం అలజడి రేగింది. పట్టాభి అదృశ్యమయ్యారని, పోలీసులే మళ్లీ అరెస్టు చేశారని, లేదు.. లేదు.. మాల్దీవులకు (maldives) వెళ్లాడని ఇలా ప్రచారం సాగింది. అనంతరం ఆయన ఓ వీడియోను ట్వీట్ చేశారు. తాను బయటకు వచ్చారని, కానీ, త్వరలోనే మళ్లీ వచ్చి క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటారని వివరించారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్