జడ్జిలు, న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో శుక్రవారం నాడు ఆరుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది.ఈ కేసులో ఇప్పటికే నలుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది.
గుంటూరు:Judges, Courtలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో శుక్రవారం నాడు ఆరుగురిని Cbi అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో ఇప్పటికే నలుగురిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఇవాళఅవుతు శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గుడా శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్, కిషోర్, అజయ్, అమృత్ లను ఇవాళ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చిన తరుణంో న్యాయ వ్యవస్థతో పాటు జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలుsocial mediaలో పోస్టు చేశారు. ఈ విషయమై దాఖలైన పిటిషన్ పై AP High Court సీరియస్ అయింది.
also read:జడ్జిలపై అభ్యంతరకర వ్యాఖ్యలు: ఏపీ హైకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించిన సీబీఐ
2020 అక్టోబర్ 8వ తేదీన ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు సీబీఐ విచారణకు అప్పగించడానికి ముందుగా ఏపీ సీఐడీ అధికారులు ఈ కేసును విచారించారు. అయితే సీఐడీ విచారణపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.
ఈ కేసులో ఈ ఏడాది జూలై, ఆగష్టు మాసాల్లో నలుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది.ఆదర్ష్ రెడ్డి, కొండారెడ్డి, సాంబశివరెడ్డి, సుధీర్ లను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో వీరిపై ఛార్జీషీట్ దాఖలు చేసింది సీబీఐ.ఈ కేసుపై ఈ నెల 6వ తేదీన సీబీఐ ఏపీ హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించింది.
doing జడ్జిలు, న్యా