అనంతపురంలో దారుణం: తన పోలికలు లేవని రెండు నెలల చిన్నారిని చంపిన తండ్రి

Published : Oct 22, 2021, 12:16 PM ISTUpdated : Oct 22, 2021, 01:20 PM IST
అనంతపురంలో దారుణం:  తన పోలికలు లేవని రెండు నెలల చిన్నారిని చంపిన తండ్రి

సారాంశం

 తన పోలికలతో కూతురు లేదనే నెపంతో రెండు మాసాల చిన్నారని తండ్రే  అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది.

అనంతపురం : తన పోలికలతో లేదంటూ  రెండు నెలల చిన్నారిని తండ్రే అత్యంత దారుణంగా హత్య చేశాడు.ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటు చేసుకొంది.బిడ్డ తన పోలికలతో లేదంటూ భార్య చిట్టెమ్మతో భర్త Mallikarjuna గొడవకు దిగాడు. చిన్నారి నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాకుండా చంపేశాడు మల్లిఖార్జున్.  చిన్నారి మృతదేహన్ని గోనెసంచిలో వేశాడు.

also read:రాజేంద్ర‌నగర్ లో అదృశ్యమైన అనీష్ కథ విషాదాంతం: ఇంటి వెనుక చెరువులో డెడ్‌బాడీ

నిన్న మధ్యాహ్నం నుండి చిన్నారి కన్పించలేదు. దీంతో Chittemma పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  చిన్నారిని తండ్రి మల్లిఖార్జున స్కూటీపై తీసుకెళ్లి చంపి గోనెసంచిలో వేశాడు.  చిన్నారిని చంపిన నిందితుడు.పాపను చంపిన మల్లిఖార్జున బెంగుళూరుకు పారిపోయాడు. అయితే ఈ విషయాన్ని ఇవాళ ఫోన్ చేసి  పోలీసులకుచెప్పాడు. మల్లిఖార్జున ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చెరువు నుండి చిన్నారి మృతదేహన్ని వెలికి తీశారు.

చిన్నారి పుట్టిన నుండి తన పోలికలతో చిన్నారి లేదని మల్లిఖార్జున బార్యతో గొడవకు దిగుతున్నాడు. ఇదే విషయమై తరచూ గొడవకు దిగాడు. నిన్న కూడ  భార్యతో గొడవపడిన మల్లిఖార్జున చిన్నారిని తీసుకెళ్లాడు. మధ్యాహ్నం నుండి చిన్నారి కన్పించకుండా పోయింది. భర్తపై అనుమానంతో పోలీసులకు చిట్టెమ్మ ఫిర్యాదు చేసింది.  నిందితుడు మల్లిఖార్జున కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మల్లిఖార్జునను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu
మండలిలో గోరెటి గర్జన | Goeti Venkanna Council Speech | Asianet News Telugu