చిత్తూరు సిస్టర్స్ సూసైడ్: లవ్ ఫెయిల్యూరే కారణమా?

Published : Oct 10, 2018, 02:21 PM IST
చిత్తూరు సిస్టర్స్ సూసైడ్: లవ్ ఫెయిల్యూరే కారణమా?

సారాంశం

ప్రేమ విషయంలోనే చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన  ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 


చిత్తూరు: ప్రేమ విషయంలోనే చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన  ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం ఇంట్లోనే  అక్కా చెల్లెళ్లు  ఉరేసుకొని  మృతి చెందిన విషయం తెలిసిందే.

చిత్తూరు జిల్లా కలికిరి పట్టణానికి  చెందిన  అక్కా చెల్లెళ్లు తస్లీమ్, షికాబీలు  రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొన్నారు.   ఒకే రంగు దుస్తులు ధరించి  అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకొన్న ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ కూడ సున్నిత మనస్తత్వం కలవారు.

అయితే  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలకమైన సమాచారాన్ని  తమ దర్యాప్తులో తెలుసుకొన్నారు. మదనపల్లెలో వీరిద్దరూ కూడ బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారు.  అక్కా ఓ యువకుడిని ప్రేమించింది.అయితే  అతను ఆ ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఆమె సూసైడ్ చేసుకోవాలని భావించింది.

అయితే ఈ విషయాన్ని చెల్లెకు కూడ చెప్పింది. దీంతో ఇద్దరూ కూడ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.  సోమవారం నాడు అక్కా చెల్లెళ్లు  ఉరేసుకొని  ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ప్రియుడికి  అక్కా రాసుకొన్న లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.అక్కా చెల్లెళ్లు ఒకరిని విడిచి మరోకరు ఉండలేరు. దీంతో ఇద్దరూ కలిసి ఉరేసుకొన్నారని  స్థానికులు  అభిప్రాయపడుతున్నారు. 

గతంలోనే ఆత్మహత్యకు ప్లాన్
అక్కా చెల్లెళ్లు తస్లీం, షికాబీలు ఆత్మహత్య చేసుకోవాలని  ప్లాన్ చేసుకొన్నారు.  ఇంటర్ చదివే రోజుల్లోనే  వీరిద్దరికీ ఓ విషయంలో అభిప్రాయబేధాలు వచ్చాయి.ఈ విషయమై  ఇద్దరూ కూడ చనిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆ సమయంలో వీరిద్దరూ కూడ పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నం చేశారు.  స్థానికులు  సకాలంలో  చూసి వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో వారు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.

అయితే రెండు రోజుల క్రితం తల్లి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి మదనపల్లికి వెళ్లింది.ఆ సమయంలో  ఓ కూతురును తోడుగా రావాలని కోరింది. కానీ, ఎవరూ కూడ వెళ్లలేదు. చదువుకోవాలని తల్లికి అబద్దం చెప్పి ఇద్దరూ ఇంటి వద్దే ఉండిపోయారు. తల్లి బయటకు వెళ్లగానే  అక్కా చెల్లెళ్లు  ఉరేసుకొని  ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 

సంబంధిత వార్తలు

ఒకే రంగు డ్రస్ వేసుకొని అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య, ఏం జరిగింది?

PREV
click me!

Recommended Stories

Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?
చెంచాగాళ్లెవరు లోకేష్ పై రెచ్చిపోయిన పేర్ని నాని | Perni Nani Sensational Comments on Nara Lokesh