
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి జవహర్ ప్రశ్నల వర్షం కురిపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దశ దిశ, స్థిరత్వం లేని నాయకుడని ఆయన విమర్శించారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. పవన్ పై పలు విమర్శలు చేశారు. ఆనాడు పవన్ సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు పవన్ పౌరుషం ఏమైందని ప్రశ్నించారు. అలాగే గత ఎన్నికల్లో కేసీఆర్ తాటతీస్తానని చెప్పి ములాఖాత్ కాలేదా? అని జవహర్ నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 15 నిమిషాలకు ఒక అత్యాచారం, హత్య జరుగుతోందని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 52 వేల అత్యాచారాలు జరిగాయని మంత్రి విమర్శించారు. దేశంలో జరుగుతున్న ఘోరాలపై పవన్ ఎందుకు ప్రశ్నించరని జవహర్ అన్నారు.