
చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ గన్‌మెన్ భార్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎంపీ వద్ద వెంకటరమణ గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతని భార్య సరస్వతి మదనపల్లె మండలం బాలాజీనగర్‌లోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కుటుంబ కలహాల కారణంగానే సరస్వతి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని.. ఈ క్రమంలో వెంకటరమణ గతంలో తన భార్యని తన సర్వీస్ గన్‌తో చంపుతానని బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై మదనపల్లె పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.