జగన్ వచ్చిన నాటి నుంచి అతివృష్టి, అనావృష్టిలే.. - మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

By Asianet NewsFirst Published Dec 6, 2023, 5:31 PM IST
Highlights

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులే ఉన్నాయని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మిచౌంగ్ తుపాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారు.

ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టిలే కనిపిస్తున్నాయని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రస్తుత మిచౌంగ్ తుపాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి, వరి, పత్తి, శనగ పంటలు నష్టపోయాయని అన్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పారు. 

దేశంలో ఒకే చోట ఓటు ఉండాలి.. డూప్లికేట్ ఓట్లను తొలగించాలి - మంత్రి జోగి రమేష్

గతంలోనే కరువు మండలాలు ప్రకటించాలని తాము డిమాండ్ చేశామని లక్ష్మీనారాయణ అన్నారు. ఎక్కువ కరువు మండలాలు ప్రకటిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతాయనే కారణంతో వాటిని ప్రకటించలేదని తెలిపారు. మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టం జరిగిన మిర్చి పంటకు 50,000, వరికి 25,000, శనగకు 25,000ల పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 

నిత్య జీవితంలో భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తోంది - రాజీవ్ చంద్రశేఖర్

రైతులకు మోసపూరిత, అబద్దాల మాటలు అవసరం లేదని, వెంటనే నష్ట పరిహారం అందించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రైతులకు అన్ని వసతులు సమకూర్చాలని చెప్పారు. గొళ్ళపాడు మునిగి పోవడానికి పూర్తి బాధ్యత అధికార వైసీపీ వహించాలని డిమాండ్ చేశారు. 

రాబోయే తరానికి కొత్త ఆవిష్కరణలు, అవకాశాలను సృష్టించడమే లక్ష్యం - కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

ఒక పక్క చేపల చెరువు, మరోపక్క రెండు లక్షల ట్రక్కుల మట్టి తోడారని, అందుకే గొళ్ళపాడు మునిగిపోయిందని చెప్పారు. నాగన్న కుంట కాలనీ వాసులను వెంటనే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడి పాఠశాల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. 8 వార్డ్ లో ఇళ్లు పడిపోయాయని, వెంటనే ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. 

click me!