దేశంలో ఒకే చోట ఓటు ఉండాలి.. డూప్లికేట్ ఓట్లను తొలగించాలి - మంత్రి జోగి రమేష్

By Asianet NewsFirst Published Dec 6, 2023, 4:52 PM IST
Highlights

ఏపీకి చెందిన వ్యక్తులకు తెలంగాణలోనూ ఓట్లు ఉన్నాయని వైసీపీ నాయకులు, మంత్రులు ఆరోపించారు. వారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు. అలాంటి వారి ఓట్లను ఏపీలో తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్లీ ఇక్కడ ఓటు వేసే అవకాశం ఇవ్వొద్దని వైసీపీ నాయకులు, మంత్రులు జోగి రమేష్,వేణుగోపాల్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లు ఎన్నికల సంఘాన్ని కోరారు. బుధవారం వీరంతా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా ను కలిశారు. తెలంగాణ లో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

నిత్య జీవితంలో భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తోంది - రాజీవ్ చంద్రశేఖర్

Latest Videos

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. దేశంలో ఒకే చోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానమని అన్నారు. హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయని చెప్పారు. వీటిని ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించామని తెలిపారు. డబుల్ ఎంట్రీలు తొలగించాలని ప్రధాన ఎన్నికల అధికారిని కోరామని చెప్పారు. ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని చెప్పామని అన్నారు. 

కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక పదవి.. ?

అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అని తెలిపారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఆరోపించారు. మోసాలు చేయడమే ఆయన ప్రధాన ఎజెండా అని చెప్పారు. ఒక సామాజికవర్గానికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నాయని తెలిపారు. టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటోందని ఆరోపించారు. 

Pannun : 13వ తేదీలోగా పార్లమెంటుపై దాడి చేస్తా - ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూన్ హెచ్చరిక.. వీడియో విడుదల..

రెండు చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి వేణుగోపాల్ అన్నారు. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

click me!