లోకేష్ ను నమ్మితే ముణగటమేనా ?

Published : Sep 16, 2017, 10:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
లోకేష్ ను నమ్మితే ముణగటమేనా ?

సారాంశం

నారా లోకేష్ ను నమ్మితే నిండా ముణగటమేనా? అవుననే అంటున్నారు కాకినాడలో మేయర్ కావాల్సి మిస్ అయిపోయిన శేషుకుమారి. శనివారం ఉదయం కాకినాడ మేయర్  అభ్యర్ధిని చంద్రబాబునాయుడు డిసైడ్ చేసారు. అయితే, అందరూ అనుకున్నట్లు శేషుకుమారి కాకుండా సుంకర పావనికి మేయర్ పీఠం దక్కింది. దాంతో శేషుకుమారి నిర్ఘాంతపోయారు.

కార్పొరేషన్ కార్యాలయం నుండి బయటకు రాగానే శేషు పార్టీ అధిష్టానంపై మండిపడ్డారు. పార్టీని నమ్ముకుంటే చివరకి మిగిలేది మట్టేనా అని ప్రశ్నించారు. సంవత్సరాల తరబడి పార్టీ కోసమే పనిచేసిన తనను అధిష్టానం మోసం చేసిందని ధ్వజమెత్తారు. పార్టీ కోసం రూ. 2.5 కోట్లు ఖర్చు పెట్టారట. ఎంఎల్ఏ టిక్కెట్టు, తర్వాత ఎంపి టిక్కెట్టు ఇస్తానంటూ మోసం చేసారట. చివరకు మేయర్ పోస్టు ఇస్తానని లోకేష్ తనకు హామీకూడా ఇచ్చినట్లు చెప్పారు. మేయర్ పోస్టు కోసమే తనతో లోకేష్ 20 నిముషాల పాటు మాట్లాడారట. తర్వాత తనను వర్క్ వుట్ చేసుకోమని చెప్పిన తర్వాతే పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టుకున్నారట. చివరకు శేషుకుమారి చెప్పిందేమంటే, పార్టీ నాయకత్వాన్ని నమ్ముకుంటే నిండా ముణగటమేనని.

PREV
click me!

Recommended Stories

YS Jagan Comments: అలా చేయడం బాబుకే సాధ్యం జగన్ కీలక కామెన్స్ కామెంట్స్| Asianet News Telugu
YS Jagan Comments on Chandrababu: ఇది ప్రభుత్వమా జంగిల్ రాజ్యమా:జగన్ | Asianet News Telugu