రాజధాని: డబ్బులేకే  పనులు మొదలు కావట్లేదా?

Published : Sep 16, 2017, 04:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
రాజధాని: డబ్బులేకే  పనులు మొదలు కావట్లేదా?

సారాంశం

చంద్రబాబునాయుడుకు పెద్ద కష్టమొచ్చిపడింది. రాజకీయంగా కాదులేండి రాజధాని నిర్మాణానికి కాసుల కష్టాలు. అమరావతిని నిర్మించాలంటే తక్కువలో తక్కువ చంద్రబాబు గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే రూ. 5 లక్షల కోట్లు కావాలి. పోయిన ఎన్నికల్లో తనలాంటి అనుభవజ్ఞుడైతేనే రాజధాని నిర్మించగలడంటూ ఊదరగొట్టారు. అది నమ్మిన జనాలు చంద్రబాబుకు ఓటువేసారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆర్కిటెక్టులకే డిజైన్లు గీసే బాధ్యత అప్పగించినా ఒక్క డిజైన్ కూడా చంద్రబాబుకు నచ్చటం లేదట. ఎందుకునచ్చటం లేదు?

చంద్రబాబునాయుడుకు పెద్ద కష్టమొచ్చిపడింది. రాజకీయంగా కాదులేండి రాజధాని నిర్మాణానికి కాసుల కష్టాలు. అమరావతిని నిర్మించాలంటే తక్కువలో తక్కువ చంద్రబాబు గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే రూ. 5 లక్షల కోట్లు కావాలి. అయితే, పై లెక్క చెప్పినపుడు చంద్రబాబు ప్రతిపక్ష నేత. ఇపుడు ముఖ్యమంత్రి. కాకపోతే అప్పట్లోనే సుఖంగా ఉండేవారు. ఎందుకంటే, గుడ్డకాల్చి ఎదుటివారిపై వేసేసి తనకు అనుకూలంగా ఉండే మీడియాతో బురదచల్లించేవారు. కానీ ఇపుడేమవుతోంది? అదే బురదిపుడు చంద్రబాబుపైనే పడుతోంది. రాష్ట్రాభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందని చంద్రబాబు చెప్పని మీటింగ్ అంటూ లేదు. నిజానికి అభివృద్ధికి తన వైఖరే అసలు అడ్డంకిగా నిలుస్తోందన్న విషయాన్ని అంగీకరించటానికి చంద్రబాబు సిద్ధంగా లేరు.

పోయిన ఎన్నికల్లో తనలాంటి అనుభవజ్ఞుడైతేనే రాజధాని నిర్మించగలడంటూ ఊదరగొట్టారు. అది నమ్మిన జనాలు చంద్రబాబుకు ఓటువేసారు. మూడున్నరేళ్ళవుతోంది. మళ్ళీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అప్పటికి ఇప్పటికీ రాజధాని పేరుతో శంకుస్ధాపనలు తప్ప ఒక్క ఇటుకు కూడా పడలేదు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆర్కిటెక్టులకే డిజైన్లు గీసే బాధ్యత అప్పగించినా ఒక్క డిజైన్ కూడా చంద్రబాబుకు నచ్చటం లేదట. ఎందుకునచ్చటం లేదు? అంటే అసలు విషయం బయటపడింది. డిజైన్లు నచ్చకకాదు జాప్యం జరుగుతోంది. చేతిలో డబ్బులు లేకే డిజైన్లు ఫైనల్ చయటం లేదని పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి.

ఎందుకంటే, ఏ పనిచేయాలన్నా ఖజానాలో కాసులుండాల్సిందే కదా? మరి, ఖజానా ఏమో ఖాళీ అయిపోయింది. కేంద్రం నిధులివ్వటం లేదు. బయటనుండి అప్పులు పుట్టటం లేదు. రాజధాని ప్రాంతంలో కొన్ని గ్రామాల్లోని రైతులు కోర్టులో కేసులేసి మంటలెక్కిస్తున్నారు. ఇంకోవైపు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వం ఆదాయం పడిపోతోంది. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన రూ. 14 వేల కోట్లు రావటం లేదని స్వయంగా చంద్రబాబే చెప్పారు. అదే సమయంలో   రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడి లెక్కల ప్రకారమే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి క్లిష్టపరిస్ధితిల్లో ఉంది. ఈ పరిస్ధితి ఒకరకంగా చంద్రబాబుకే పిచ్చెక్కిస్తోంది. డబ్బు లేక రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించటం లేదని ఒప్పుకోలేకే డిజైన్లు బాగాలేదని కాలయాపన చేస్తున్నారు.

 

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu