పల్లెపై ఎస్సీ కేసు నమోదుకు ఆందోళన

Published : Sep 16, 2017, 03:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
పల్లెపై ఎస్సీ కేసు నమోదుకు ఆందోళన

సారాంశం

మాజీమంత్రి పల్లె రఘునాధరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు. అమడగూరు మండంలంలోని మహహ్మదాబాద్ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ యువకుడు ఆదినారాయణ పల్లెపై ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ అక్కడ గోల జరుగుతోంది. ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమం మొదలుపెట్టారు కదా?   కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా అమడగూరు మండలంలోని మహమ్మదబాద్ గ్రామానికి వెళ్ళారు.మంత్రికి-యువకుడికి మధ్య మాటా మాటా పెరిగింది.

మాజీమంత్రి పల్లె రఘునాధరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు. అమడగూరు మండంలంలోని మహహ్మదాబాద్ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ యువకుడు ఆదినారాయణ పల్లెపై ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ అక్కడ గోల జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే, చంద్రబాబునాయుడు ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమం మొదలుపెట్టారు కదా?  కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా అమడగూరు మండలంలోని మహమ్మదబాద్ గ్రామానికి వెళ్ళారు.

గ్రామంలోని ఎస్సీ కాలనీకి ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ పథకాల గురించి మంత్రి వివరిస్తున్నారు. అదే సమయంలో ఆదినారాయణ అనే యువకుడు లేచి తమకు ఇళ్ళు కావాలని ఎంతకాలం నుండి అడుగుతున్నా పట్టించుకోవటం లేదంటూ ఫిర్యాదు చేసాడు. దాంతో మంత్రికి-యువకుడికి మధ్య మాటా మాటా పెరిగింది. దాంతో అక్కడి నుండి వెళ్లిపోయిన పల్లె తన కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళీ మహమ్మదాబాద్ కు తిరిగి వచ్చారు.

ఎస్సీ కాలనీకి పల్లె ఎందుకు మళ్ళీ వచ్చారా అంటూ అందరికీ ఆశ్చర్యమేసింది. అయితే, పల్లె నేరుగా ఉదయం తనతో వాగ్వాదానికి దిగిన ఆదినారాయణ ఇంటికి వెళ్ళారు. యువకుని కోసం అడిగితే ఇంట్లో లేరని చెప్పారు. దాంతో పోలీసులను పంపి వెదికించారు. స్నేహితుని ఇంట్లో ఉన్న యువకుడిని పోలీసులు పట్టుకుని పల్లె ముందు హాజరుపరిచారు. యవకుడిని చూడగానే పల్లె మళ్ళీ రెచ్చిపోయి నోటికి పనిచెప్పారు. దాంతో కుటుంబసభ్యులు భయపడిపోయారు. ఇంతలో పల్లెతో పాటు యువకుడు, అతని మామ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళారట. సరే, వాళ్ళమధ్య ఏం జరిగిందో ఏమోగానీ పల్లె అక్కడి నుండి వెళ్ళిపోయారు.

అయితే, పల్లె అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అసలు విషయం బయటకుపొక్కింది. ఇంతకీ అక్కడేం జరిగిందంటే, వేరే గదిలోకి ముగ్గురు వెళ్ళగానే పల్లె కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుడుకున్నారట మిగిలిన ఇద్దరు. అంతేకాకుండా ఇంకెప్పుడూ తన జోలికి రాకుండా వారిద్దరి చేత పల్లె ప్రమాణాలు కుడా చేయించుకున్నారట. తర్వాత ఆ విషయం ఆనోట ఈనోట జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరిగింది. అదే విషయమై ఆదినారాయణ మాజీ మంత్రిపై అమడగూరు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసారు. అయితే, అధికారంలో ఉన్నవారిపై ఎవరన్నా ఫిర్యాదు  చేస్తే కేసు నమోదు చేస్తారా? ఇక్కడా అదే జరిగింది. అందుకే ఎస్సీ సంఘాలు, వైసీపీ నేతలు పోలీస్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

YS Jagan Comments: అలా చేయడం బాబుకే సాధ్యం జగన్ కీలక కామెన్స్ కామెంట్స్| Asianet News Telugu
YS Jagan Comments on Chandrababu: ఇది ప్రభుత్వమా జంగిల్ రాజ్యమా:జగన్ | Asianet News Telugu