ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో కరోనా ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుండి తిరుపతికి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఈ నెల 12న ఆమె కెన్యా నుండి తిరుపతికి వచ్చింది.
తిరుపతి: Andhra pradesh రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. kenya నుండి తిరుపతికి వచ్చిన మహిళకు Omicron నిర్ధారణ అయింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రకటించారు. ఈ నెల 12న ఆమెకు పరీక్షలు నిర్వహిస్తే కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆమె శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. ఈ పరీక్షల్లో ఆ మహిళకు కరోనా ఒమిక్రాన్ సోకిందని తేలింది.
ఈ నెల 10న కెన్యా నుండి చెన్నైకి అక్కడి నుండి Tirupati కి 39 ఏళ్ల మహిళ వచ్చిందని ఏపీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి తెలిపారు. తిరుపతిలో ఆమెకు పరీక్షలు నిర్వహిస్తే కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో విదేశాల నుండి వచ్చిన 45 మంది ప్రయాణీకులు ఏపీకి వచ్చారు. వారిలో తొమ్మిది మందికి కరోనా నిర్ధారణ అయింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు ఈ నెల 12న నమోదైంది. ఐర్లాండ్ నుండి ఏపీకి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. Vizianagaram జిల్లాకు వచ్చిన ఆ వ్యక్తికి ఒమిక్రాన్ సోకడంతో ఆయనతో కాంటాక్టులోకి వెళ్లిన ఆయన బంధువులకి కూడా పరీక్షలు నిర్వహించారు. ఆ వ్యక్తిని కూడా ఐసోలేషన్ కు తరలించారు.
దేశంలో కొత్తగా మరో 14ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వేరియంట్ మొత్తం కేసులు 213కు పెరిగాయి. ఒమిక్రాన్ వేరియంట్ మొత్తం కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర, ఢిల్లీలోనే వెలుగుచూశాయని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు అత్యధికం దేశరాజధాని ఢిల్లీలోనే 57 కేసులు నమోదయ్యాయి. రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో 54 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 2, ఒడిశాలో 2, ఉత్తరప్రదేశ్,ఆంధ్రప్రదేశ్ లో 2, ఛండీగఢ్, లద్దాఖ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ ఒమిక్రాన్ బారినపడి కోలుకున్న వారి సంఖ్య సైతం అధికంగానే ఉంది. దేశంలో కొత్త వేరియంట్ సోకిన వారిలో ఇప్పటివరకు 90 మంది కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
undefined
also read:ఒమిక్రాన్ అందరి ఇళ్లకు చేరుతుంది.. బహుశా చెత్త దశను చూడొచ్చు.. బిల్‌గేట్స్ హెచ్చరిక
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దక్షిణాఫ్రికా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఈ రకం కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అక్కడ పరిస్థితులు దారుణంగా మారుతుండటంలో ప్రపంచ దేశాలు సైతం కొత్త వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నిత్యం నమోదుకావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దేశంలో కొత్త వేరియంట్ కేసులు 200లకు పైగా చేరాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలతో హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఇదివరకు కల్లోలం సృష్టించిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ ప్రభావం వివిధ ప్రాంతాల్లో ఉందని పేర్కొంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపింది. దీని కోసం స్థానిక ఆంక్షలు విధించాలని సూచించింది. ముందస్తు చర్యల్లో భాగంగా వార్ రూమ్ లను ఏర్పాటు, కోవిడ్ కేర్, ఐసోలేషన్ సెంటర్లను యాక్టివ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.